హోమ్ /వార్తలు /national /

TRS VS BJP: మారుతున్న టీఆర్ఎస్ వ్యూహం.. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ

TRS VS BJP: మారుతున్న టీఆర్ఎస్ వ్యూహం.. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Dubbaka by election: దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉంటుందని బీజేపీ భావిస్తోంది.

  తెలంగాణలో జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం గెలుపుతో సరిపెట్టుకోకుండా భారీ మెజార్టీతో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తుండటమే. టీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ఆర్థిక మంత్రి హరీశ్ రావు... కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు.

  Trs vs bjp, dubbaka news, trs news, bjp news, dubbaka by elections, telangana news, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, దుబ్బాక న్యూస్, టీఆర్ఎస్ న్యూస్, బీజేపీ న్యూస్, దుబ్బాక ఉప ఎన్నికలు, తెలంగాణ న్యూస్
  హరీశ్‌రావు(ఫైల్ ఫొటో)

  బాయికాడ మీటర్లు రావొద్దన్నా..విదేశీ మక్కలు రావొద్దన్నా.. మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఏస్ అభ్యర్థిని లక్ష మెజారిటీతో గెలిపించి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ దాదాపు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరపున దుబ్బాక నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమైన రఘునందన్ రావు.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక సమస్యలు, పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండటంతో... తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  dubbaka election 2020, dubbaka by election. dubbaka by poll, dubbaka election date, telangana news, telangana bjp, telangana bjp news, raghunandan rao bjp, raghunandan rao dubbaka, దుబ్బాక ఉప ఎన్నికలు 2020, దుబ్బాక బైపోల్స్ 2020, రఘునందన్ రావు బీజేపీ, తెలంగాణ ఉప ఎన్నికలు 2020
  ప్రతీకాత్మక చిత్రం

  తన మాట తీరుతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను టీఆర్ఎస్ మోసం చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకపోయినా.. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అలా చేయగలిగితే.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే భావన కలిగించవచ్చని యోచిస్తోంది.

  దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు దుబ్బాకలో బీజేపీని నిలువరించగలిగితే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని దెబ్బకొట్టొచ్చనే భావనలో టీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దుబ్బాకలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తోందనే టార్గెట్ వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Dubbaka By Elections 2020, Telangana, Trs

  ఉత్తమ కథలు