హోమ్ /వార్తలు /national /

గోషామహాల్ నుంచి ఎన్నికల బరిలోకి ట్రాన్స్‌జెండర్

గోషామహాల్ నుంచి ఎన్నికల బరిలోకి ట్రాన్స్‌జెండర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లక్షమందికి పైగా ట్రాన్స్‌జెండర్లు తెలంగాణలో ఉన్నా.. గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు చంద్రముఖి. అనేక రకాల సమస్యలపై మా కమ్యూనిటీ ఎప్పుడూ పోరాడుతూ వస్తుందన్నారు చంద్రముఖి. ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు , తమ సమస్యల్ని మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని చెబుతున్నారు చంద్రముఖి.

ఇంకా చదవండి ...

  ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలోకి ట్రాన్స్‌జెండర్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఎల్‌ఎఫ్ పార్టీ తరపున మువ్వల చంద్రముఖి ఎన్నికల పోటీకి దిగింది. చంద్రముఖికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఉన్నత విద్యా అభ్యసించింది. భరతనాట్య కళాకారిణి. అంతేకాదు వ్యాఖ్యాత, సినీ నటి కూడా. చూడ చక్కగా కనిపించే చంద్రముఖి ... ఇప్పుడు చట్టసభల్లో తమ గొంతును వినిపించేందుకు ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధిగా ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు.

  రాజకీయ పార్టీలు, ప్రజ, హక్కుల సంఘాల మద్దతుతో ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు చంద్రముఖి. మహిళలపై కొనసాగుతున్న అన్నిరకాల అణచివేతలు ట్రాన్స్‌జెండర్లపైన కూడా ఉన్నాయంటున్నారు. అన్ని రకాల వేధింపుల్ని భరిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తమను గుర్తించినా.. ఆచరణలో మాత్రం అవి అమలుకు నోచుకోవడం లేదన్నారాయన. లక్షమందికి పైగా ట్రాన్స్‌జెండర్లు తెలంగాణలో ఉన్నా.. గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. అనేక రకాల సమస్యలపై మా కమ్యూనిటీ ఎప్పుడూ పోరాడుతూ వస్తుందన్నారు చంద్రముఖి. ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు , తమ సమస్యల్ని మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని చెబుతున్నారు. ప్రజలు తనను ఆదరించాలని కోరుతున్నారు.

  తాను గెలిస్తే కేవలం ట్రాన్స్ జెండర్ల ప్రతినిధిగానే కాకుండా గోషామహల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు, ఆదరణ తమకు ఉందని, తప్పనిసరిగా గెలిచి తీరుతానని కూడా చంద్రముఖి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ ఇప్పటికే సుమారు 106 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఎల్ఎఫ్ ప్రకటించిన జాబితాలో 52 మంది బీసీలకు టికెట్లు కేటాయించింది.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Telangana Election 2018, Telangana News, Transgender

  ఉత్తమ కథలు