హోమ్ /వార్తలు /national /

JaggaReddy: హరీష్ రావు రాజకీయ మొగోడు కాదు.. పోలీస్‌లతో బ్రతికే మొగోడు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

JaggaReddy: హరీష్ రావు రాజకీయ మొగోడు కాదు.. పోలీస్‌లతో బ్రతికే మొగోడు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హరీష్ రావు రాజకీయ మొగోడు కాదని.. పోలీస్‌లతో బ్రతికే మొగోడు అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి పోలీస్‌లను ఎదిరించి బ్రతికే మొగోడని చెప్పుకొచ్చారు. హరీష్ రావు- జగ్గారెడ్డి రాజకీయానికి చాలా ఫరాక్ ఉంటుందని.. సంగారెడ్డి నుండి సిద్దిపేటకు హరీష్ రావు మెడికల్ కాలేజీ తీసుకుపోతే మూడు ఏళ్లు పోరాటం చేశానని జగ్గారెడ్డి చెప్పారు.

ఇంకా చదవండి ...

  సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎప్పుడు ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. హరీష్ రావు రాజకీయ మొగోడు కాదని.. పోలీస్‌లతో బ్రతికే మొగోడు అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి పోలీస్‌లను ఎదిరించి బ్రతికే మొగోడని చెప్పుకొచ్చారు. హరీష్ రావు- జగ్గారెడ్డి రాజకీయానికి చాలా ఫరాక్ ఉంటుందని.. సంగారెడ్డి నుండి సిద్దిపేటకు హరీష్ రావు మెడికల్ కాలేజీ తీసుకుపోతే మూడు ఏళ్లు పోరాటం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. 2014లో తాను ఓడిపోయాక, టీఆర్‌ఎస్ గెలిచాక నియోజకవర్గంలో జరిగిన ఒక అభివృధ్దైనా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. తన పోరాటం వల్లే కదా మెడికల్ కాలేజీ వచ్చిందని.. ఇది అందరు చూశారు కదా అని.. అసెంబ్లీలో కూడా కేసీఆర్ చెప్పిన సమాధానం ఇదని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కనుకే 57 ఏళ్లకే పెన్షన్, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు పంట నష్టపరిహారం మరెన్నో ప్రజల సమస్యలపై సీఎం హామీలు ఏమైయ్యాయని అడుగుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే సదాశివపేటలో 5 వేల ప్లాట్ పట్టాలు, అలియబాద్‌లో 3 వేల ప్లాట్ పట్టాలు ఇచ్చేవాడినని జగ్గారెడ్డి చెప్పారు. తాను ఓడిపోయాక టీఆర్‌ఎస్ వాళ్లు ఆ ప్లాట్‌లు ఆపేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో 40 వేల ఇండ్ల పట్టాలు ఇస్తానని, జగ్గారెడ్డి మాటంటే మాటేనని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తానని.. సంగారెడ్డి నియజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీ పార్టీ మారారని గుర్తుచేశారు.

  పార్టీ మారే వారిని తాను విమర్శించనని, పార్టీ మారే వారి పరిస్థితి ఎలా ఉందో ఎందుకు మారుతున్నారో అది వ్యక్తిగతమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఒక గ్రామంలో, వార్డ్‌లో బలమైన నాయకుడు వెళ్లిపోతున్నాడని ఎవరూ అనుకోవద్దని.. ఆ గ్రామంలో, వార్డ్‌లో ఒక కార్యకర్తయిన ఉంటారు కదా.. ఆ కార్యకర్తనే నాయకుడిగా తయారు చేస్తానని జగ్గారెడ్డి కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. బలమైన నాయకుడు వెళ్ళగానే ఓట్లు పోయాయని ఎవరూ భావించొద్దని.. ప్రజలు ఇప్పుడు ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారు తీసుకుంటున్నారని చెప్పారు. తనను అభిమానించే వారిని కాపాడుకుంటానని, గెలిచినాఓడినా కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కార్యకర్తలకు భరోసానిచ్చారు. సంగారెడ్డిలో చేసే పండగలు చేస్తూనే ఉంటానని, ఇంటింటికి మంజీర నీళ్లు అందించానని.. అనేక ఫిల్టర్ బెడ్‌లు కట్టించానని జగ్గారెడ్డి చెప్పారు. తాను గెలిచాకే సంగారెడ్డి హైవే 4వే లైన్ వేయించానని, నియోజకవర్గంలో అనేక రోడ్లు వేయించానని ఎమ్మెల్యే కార్యకర్తలతో అన్నారు. ఒక ఐఐటీ, రాజీవ్ పార్క్, బతుకమ్మ ఆడుకోవడానికి ట్యాంక్‌బండ్, పీజీ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్, కోర్ట్ బిల్డింగ్ ఇవన్నీ తాను కదా తెచ్చింది అని నియోజకవర్గ ప్రజలను అడిగారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దని.. తననూ, పార్టీని వదిలిపోయే వారి గురించి పట్టించుకోకండని.. ప్రతీ కార్యకర్తకి, పేదవాడికి కొంచెం ముందో వెనుకో ఎంతో కొంత సహాయం చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

  ఇక నుంచి 6 రోజులు కార్యకర్తలకు, నాయకులకు సమయం ఇస్తానని, 6 రోజులు ప్రజలకు, 2 రోజులు ప్రజా దర్బార్.. మిగతా 10 రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీకి టైమ్ ఇస్తానని, 5 రోజులు ఫ్యామిలీకి కేటాయిస్తానని ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. దయచేసి కార్యకర్తలు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

  First published:

  Tags: Harish Rao, Jaggareddy, Sangareddy, TS Congress

  ఉత్తమ కథలు