హోమ్ /వార్తలు /national /

Revanth Reddy: KCR ఆ పని చేయకపోతే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బంది పడేవారు కాదు.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైర్​

Revanth Reddy: KCR ఆ పని చేయకపోతే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బంది పడేవారు కాదు.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైర్​

తెలంగాణ రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్​ సంచలన కామెంట్స్​ చేశారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్​ సంచలన కామెంట్స్​ చేశారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్​ సంచలన కామెంట్స్​ చేశారు.

  వరి ధాన్యం కొనుగోలు విషయం (Grain purchase controversy) గత కొద్దిరోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలారోజులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్​ గాంధీ (MP Rahul gandhi) ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టె రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు. దీంతో పాటు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు (paddy procurement) చేసేవరకు కాంగ్రెస్ పార్టీ (Congress party) రైతుల తరపున పోరాటం చేస్తుందని అన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ (Minister KTR) త‌ప్పుప‌ట్టారు. ఈ క్రమంలో అటు కాంగ్రెస్​ నుంచి కూడా టీఆర్​ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సీఎం కేసీఆర్​పై విమర్శలు చేశారు. తెలంగాణ రైతుల (Telangana Farmers) ప్రయోజనాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

  కేంద్రంతో కేసీఆర్​ ఒప్పందం..

  శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్​.. కేంద్రంతో కేసీఆర్ (CM KCR) ఒప్పందం చేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. సీఎం లేఖ (Letter) రాయకపోతే.. పీయూష్ గోయల్ చొక్కా పట్టుకుని అడిగేవాళ్లమని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్, పెట్రోల్ ధరలకు నిరసనగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

  రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టండి..

  ఈనెల 4 నుంచి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ ముట్టిస్తామని.. బషీర్‌బాగ్ తరహాలో ఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రేణులకు టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టాలని ఆయన కోరారు. యూపీఏ హయాంలో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం భరించిందని రేవంత్ గుర్తుచేశారు. రూ.50కి వస్తున్న పెట్రోల్‌పై కేసీఆర్ రూ.35, మోడీ రూ.30 పన్ను వేస్తున్నారంటూ దుయ్యబట్టారు. 8 ఏళ్లలో పన్నుల రూపంలో రూ.36 లక్షల కోట్లను కేంద్రం దోచుకుందని రేవంత్ ఆరోపించారు.

  టీఆర్​ఎస్​ ప్రభుత్వం సంతకం..

  2021లో పారాబాయిల్డ్ రైస్ పంపమని ఒప్పందంపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం సంతకం (Signature) చేసిందని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందమే తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని.. ఒప్పందం కుదుర్చుకోకపోతే పీయూష్ గోయల్‌ను నిలదీసేవాళ్లమని రేవంత్ అన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టాలన్నారు. గవర్నర్ వ్యవస్థను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.

  First published:

  Tags: CM KCR, Revanth Reddy

  ఉత్తమ కథలు