హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు..పూర్తి వివరాలు ఇవే..

Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు..పూర్తి వివరాలు ఇవే..

గుజరాత్ బరిలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

గుజరాత్ బరిలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో తెలిసిపోయింది. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు 17తో ముగియగా..రెండో దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు నిన్న 21తో ముగిసింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం అభ్యర్థుల సంఖ్య ఓ కొలిక్కి వచ్చింది.  కాగా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 1621 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gujarat, India

  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో తెలిసిపోయింది. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక మొదటి దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు 17తో ముగియగా..రెండో దశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు నిన్న 21తో ముగిసింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం అభ్యర్థుల సంఖ్య ఓ కొలిక్కి వచ్చింది.  కాగా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 1621 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  Tamilnadu: తండ్రి సమాధి కోసం గూగుల్లో సెర్చ్‌ చేసి మలేషియా ప్రయాణం..తమిళనాడు వ్యక్తి ఇంట్రెస్టింగ్ జర్నీ

  తొలి దశలో 788 మంది..రెండో దశలో 833 మంది అభ్యర్థులు

  తొలి దశలో పోలింగ్ జరగనున్న 89 అసెంబ్లీ స్థానాలకు గానూ 788 మంది అభ్యర్థులు ఉన్నారు. రెండో దశలో పోలింగ్ జరగనున్న 93 స్థానాలకు 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

  Coronary Stents: ఎసెన్షియల్‌ మెడిసిన్స్ జాబితాలో కరోనరీ స్టెంట్స్.. మరింత తగ్గనున్న ధరలు

  బీజేపీ 182..కాంగ్రెస్ 179..ఆప్ 182 స్థానాల్లో పోటీ..

  ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 182 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా..కాంగ్రెస్ 179 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా..ప్రీ పోల్ అలియన్సు లో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో సీట్లను కేటాయించింది. అయితే దేవ్ ఘడ్ బరియా స్థానంలో NCP అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 182 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే సూరత్ ఈస్ట్ స్థానంలో ఆప్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసుకోవడంతో 181 స్థానాల్లో పోటీలో ఉంది. ఇక MIM 14 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా..ఓ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు.

  గుజరాత్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ , కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది.  ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: AAP, Bjp, Congress, Gujarat Assembly Elections 2022, Gujarath state

  ఉత్తమ కథలు