హోమ్ /వార్తలు /national /

‘తార’స్థాయికి ఎన్నికల ప్రచారం.. తెలంగాణలో అగ్రనేతల టూర్లు

‘తార’స్థాయికి ఎన్నికల ప్రచారం.. తెలంగాణలో అగ్రనేతల టూర్లు

all party leaders

all party leaders

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో పార్టీలన్నీ అగ్రనేతలను రంగంలోకి దించుతున్నాయి. నేతలందరూ ఒకేసారి రాష్ట్రానికి తరలివస్తుండడంతో ప్రచార వేడి మరింత పెరిగింది.

  ఎలక్షన్ డేట్ దగ్గరపడుతున్న వేళ పార్టీలన్నీ తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీల అగ్రనేతలు.. బీజేపీ జాతీయ నేతలు బుధవారం రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో మరింత వేడి రాజుకోనుంది.

  ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేడ్చల్‌లో బహిరంగ సభ నిర్వహించి సోనియాగాంధీని ముఖ్య అతిథిగా తీసుకొచ్చింది. అందుకు ధీటుగా, అదే లొకేషన్లో బుధవారం బహిరంగసభను నిర్వహిస్తోంది బీజేపీ. ఈ మీటింగ్‌కు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను చీఫ్ గెస్ట్‌గా తీసుకొస్తోంది.

  మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా బుధవారం రాష్ట్రంలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఆదిలాబాద్, చౌటుప్పల్, ఎల్బీనగర్లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

  ఇప్పటికే ఖమ్మంలో బుధవారం ప్రజాకూటమి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇరువురు నేతలూ తొలిసారి వేదిక పంచుకుంటుండటంతో.. ఈ మీటింగ్‌పై ఆసక్తి నెలకొంది. కొడంగల్, హైదరాబాద్ సభల్లోనూ రాహుల్, చంద్రబాబు ద్వయం పాల్గొంటుంది.

  మరోవైపు, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బుధవారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు వస్తున్న ఆమె.. ఉదయం 11గంటలకు నిర్మల్ సభలో, మధ్యాహ్నం ఒంటి గంటకు మంచిర్యాల సభలో పాల్గొంటారు. ఒకేసారి జాతీయ నేతలు ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి తరలివస్తుండడంతో.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amit Shah, Bjp, Bsp, Chandrababu Naidu, Mahakutami, Mayawati, Rahul Gandhi, Sonia Gandhi, Sushma Swaraj, TDP, Telangana, Telangana Election 2018, Telangana News, TS Congress

  ఉత్తమ కథలు