హోమ్ /వార్తలు /national /

‘విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ త్వరలో మూతపడుతుంది’

‘విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ త్వరలో మూతపడుతుంది’

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్

40వేలమంది ఉద్యోగులు, లక్షమంది డైరెక్ట్. ఇన్ డైరెక్ట్‌గా ఉక్కు కర్మాగారంలోపనిచేస్తున్నారన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులు పోరాడి విశాఖ ఉక్కు కార్మాగారాన్ని సాధించుకున్నారన్నారు.

  విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనుందా? ఆ ప్రాంతంలో మరో ఫ్యాక్టరీ రానుందా? టాలీవుడ్ హీరో శివాజీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖలో అతిపెద్దదైనా ఉక్కు కార్మాగారం మూతపడనుందని బాంబ్ పేల్చారు. ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాకు చెందిన ఐరన్ కంపెనీ పోస్కో కోసం మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూసేస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేస్తున్నారు ఇది నిజమన్నారు. 40వేలమంది ఉద్యోగులు, లక్షమంది డైరెక్ట్. ఇన్ డైరెక్ట్‌గా ఉక్కు కర్మాగారంలోపనిచేస్తున్నారన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులు పోరాడి విశాఖ ఉక్కు కార్మాగారాన్ని సాధించుకున్నారన్నారు. 60వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగఫలమన్నారు. తాజాగా ఉక్కు శాఖ మంత్రి జగన్‌ను కలిసింది కూడా ఇదే విషయమై చర్చించడానికేనని తెలిపారు శివాజీ.

  పోస్కో కంపెనీకి సంబంధించిన భూముల కోసం కేంద్రమంత్రి ఏపీముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అది మర్యాదపూర్వక భేటీ కాదన్నారు. వాళ్ల ఒప్పందాల కోసం వచ్చారన్నారు. అప్పట్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 60వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కేవలం 150 గజాలు స్థలం ఇచ్చారన్నారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి మీడియేటర్ చేస్తున్న వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నారు. కానీ ఆయన ఎవరో చెప్పనన్నారు శివాజీ. తెలుగు వ్యక్తి... ఢిల్లీలో పదవిలో ఉన్న వ్యక్తేనని తెలిపారు. మరి విశాఖపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న ఏపీ ప్రభుత్వం బారి నుంచి ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడండి అంటూ సవాల్ చేశారు. ఇప్పుడు ఆ రైతులకు అండగా ఎవరు వస్తారో చూడాలన్నారు శివాజీ.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Shivaji, Visakhapatnam

  ఉత్తమ కథలు