హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ కార్మికులకు చివరి అవకాశం.. మంచుకొస్తున్న కేసీఆర్ డెడ్ లైన్

ఆర్టీసీ కార్మికులకు చివరి అవకాశం.. మంచుకొస్తున్న కేసీఆర్ డెడ్ లైన్

సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరినవారికే ఉద్యోగాలు ఉంటాయన్నాడు. దీంతో పలుచోట్ల కేసేీఆర్ ప్రకటనతో భయాందోళనలు వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డ్యూటీల్లో చేరారు.

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 32వ రోజుకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. నవంబర్ 5వతేదీ సాయంత్రం  5 గంటల్లోపు విధుల్లో చేరినవారికే ఉద్యోగాలు ఉంటాయన్నాడు. దీంతో పలుచోట్ల కేసేీఆర్ ప్రకటనతో భయాందోళనలు వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డ్యూటీల్లో చేరారు. తాము డ్యూటీల్లో చేరుతున్నట్లు పై అధికారులకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు.

  మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామ రెడ్డి... కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టిన సమ్మె యథావిథంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. కార్పొరేషన్ మార్చాలంటే కేంద్ర అనుమతి తప్పనిసరి అన్నారు. గతంలో ఇలాంటి సీఎంలను చాలామందినే చూశామన్నారు. కానీ కోర్టు ఆదేశాల్ని ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రెవెన్యూ అధికారులను విలన్లుగా చిత్రీకరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు.

  First published:

  Tags: CM KCR, Rtc, Rtc jac, Telangana Politics, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు