హోమ్ /వార్తలు /national /

మరికాసేపట్లో ఈడీ విచారణకు సుజనా చౌదరి

మరికాసేపట్లో ఈడీ విచారణకు సుజనా చౌదరి

అయితే రాజధాని విషయంలో ఎవరెన్ని చెప్పినా... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ పదే పదే సుజనా చౌదరి చెబుతూ వస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది.

అయితే రాజధాని విషయంలో ఎవరెన్ని చెప్పినా... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ పదే పదే సుజనా చౌదరి చెబుతూ వస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది.

సుజనా చౌదరి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ. 5799 కోట్లను కొల్లగొట్టారన్నారు ఈడీ తరపు న్యాయవాది. దీంతో న్యాయస్థానం సుజనా పిటిషన్‌ను కొట్టివేశారు. డిసెంబర్ 3న ఈడీ విచారణకు హాజరవ్వాలని సుజనాను ఆదేశించింది.

  మాజీ కేంద్రమంత్రి , టీడీపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మరికాసేపట్లో ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

  కేంద్ర ప్రభుత్వం తనను రాజకీయంగా వేధిస్తోందనీ, ఈడీ, ఐటీ శాఖలను ఇందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సుజనా చౌదరి న్యాయవాది చేసిన వాదనలను ఈడీ ప్రతినిధి ఖండించారు. ఆయన బ్యాంకులను మోసం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. సుజనా చౌదరి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ. 5799 కోట్లను కొల్లగొట్టారన్నారు. దీంతో న్యాయస్థానం సుజనా పిటిషన్‌ను కొట్టివేశారు. డిసెంబర్ 3న ఈడీ విచారణకు హాజరవ్వాలని సుజనాను ఆదేశించింది. అయితే అరెస్ట్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవద్దని ఈడీ అధికారులకు కోర్టు సూచించింది.

  సుజనా చౌదరిపై వస్తున్న ఆరోపణలతో 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. గతనెలలోను, అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆయన కంపెనీల్లో సోదాలు చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు , ఫైల్స్ , కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Enforcement Directorate, Sujana Chowdary

  ఉత్తమ కథలు