సినిమాల నిర్మాణం నుంచి సీఎం వరకు... కుమార స్వామి ప్రస్థానం

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:48 PM IST
సినిమాల నిర్మాణం నుంచి సీఎం వరకు... కుమార స్వామి ప్రస్థానం
పూజలు నిర్వహిస్తున్న కుమారస్వామి (File)
 • News18
 • Last Updated: June 6, 2018, 3:48 PM IST
 • Share this:
కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రెండోసారి అధికారం చేపట్టారు. గతంలోనూ 2008లో కర్నాటక 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  ఐతే కుమార స్వామి రాజకీయ జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.  కన్నడ నటి రాధికను పెళ్లి చేసుకోడం నుంచి మొదలుకొని, బీజేపీతో సంబంధాలు, ఇప్పుడు సీఎంగా ఎన్నికవడం వరకు ఎన్నో అంశాలు దేశ ద్రుష్టిని ఆకర్షించాయి. కుమార స్వామికి సంబంధించిన 7  కీలక విషయాలేంటో చూద్దాం..! 1. కుమారస్వామి డిసెంబరు 1, 1959 లో జన్మించారు. ఆయన తండ్రి హెచ్. డి. దేవెగౌడ భారత మాజీ ప్రధాన మంత్రి. ప్రజలు ఆయన్ను కుమారన్న అని ముద్దుగా పిలుస్తారు. బెంగళూరు నేషనల్ కాలేజీలో కుమారస్వామి బీఎస్సీ చదివారు. 2. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో కుమారస్వామే అత్యంత ధనవంతుడు. కుమారస్వామి చరాస్థుల విలువ 43.91 కోట్లు. ఆయన భార్య అనిత ఆస్తుల విలువ 124 కోట్లు. 3. కుమారస్వామి 1996లో రాజకీయ అరంగ్రేటం చేశారు. కనకపుర లోక్ సభ నియోజవర్గం నుంచి గెలుపొంది పార్లమెంట్ లో అడుగుపెట్టారు.1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. తిరిగి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 4. 2004లో కూడా కాంగ్రెస్ , జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ధరమ్ సింగ్ సీఎంగా ఉన్నారు. ఐతే 2006లో సంకీర్ణ సర్కారు నుంచి జేడీఎస్ బయటకు వచ్చింది. అనంతర బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చెరో 20 నెలల పాటు సీఎం పదవిలో ఉండాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు మొదట సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి ఫిబ్రవరి 4,2006 నుంచి అక్టోబరు 9, 2007 వరకు సీఎంగా ఉన్నారు. అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకొని..సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించారు.
 5. కుమారస్వామి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య అనిత. వీరిద్దరికి కుమారుడు నిఖిల్. కన్నడ సినిమాల్లో నిఖిల్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఇక 2006లో కుమార స్వామి రెండో వివాహం చేసుకున్నారు. వయసులో తన కంటే 27 ఏళ్లు చిన్నదైన కన్నడ నటి రాధికను పెళ్లాడారు. వీరిద్దరికి ఓ కూతురు ఉంది. 6. రాజకీయాలతో పాటు కన్నడ సినీ పరిశ్రమతోనూ కుమారస్వామికి సంబంధాలు ఉన్నాయి. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడంతో పటు డిస్ట్రిబ్యూటర్ గానూ పని చేశారు. 7. 2013లో కుమారస్వామి కుమారుడు నిఖిల్ లంబోర్గిని కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. 5 కోట్ల విలువైన ఆ కారును కుమారస్వామే గిఫ్ట్ గా ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ నిఖిలే ఆ కారును కొనుకున్నాడని  కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు
 8. .


Published by: Shiva Kumar Addula
First published: May 25, 2018, 8:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading