హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Abhishek Banerjee: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కీలక పదవి..

Abhishek Banerjee: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కీలక పదవి..

అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)

అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)

పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది.

  పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్‌ నియమితులయ్యారు. బెంగాల్‌లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్టీ వర్కింగ్‌ కమిటీ తొలి సమావేశంలో అభిషేక్‌ పేరును మమత ప్రతిపాదించగా.. పార్టీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తృణమూల్ నేత పార్థా చటర్జీ శనివారం జరిగిన ప్రెస్‌ మీట్‌లో వెల్లడించారు. ‘మా పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఎంపీ అభిషే బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నామినేట్ చేశారు’అని తెలిపారు. ప్రస్తుతం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుభ్రతా బక్షి అబిషేక్ బెనర్జీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

  ఇక, డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ ఎంపీగా ఉన్న అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం టీఎంసీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో.. అభిషేక్ యూత్ వింగ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈ నేపథ్యంలో యూత్ వింగ్ అధ్యక్షురాలిగా నటి, టీఎంసీ నాయకురాలు సాయోనీ ఘోష్‌ నియమించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నుంచి బరిలో నిలిచిన సాయోనీ ఓడిపోయారు. అయితే టీఎంసీ యువ కార్యకర్తల్లో సాయోనీకి విపరీతమైన పాపులారిటీ ఉంది.

  పార్టీలో ఒక పదవి ఒకరికే అన్న నిబంధనను వర్కింగ్ కమిటీ నిర్ణయించిందని.. ఇందుకు కోర్ కమిటీ ఆమోదం తెలిపిందని పార్థా చటర్జీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరి.. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న వారి గురించి సమావేశంలో చర్చించలేదని తెలిపారు.

  ఇక, అభిషేక్ బెనర్జీ మమత సోదరుడు అమిత్ బెనర్జీ కుమారుడు. అభిషేక్ 26 ఏళ్ల వయసులో టీఎంసీ తరఫున ఎంపీగా గెలుపొంది.. యంగెస్ట్ పార్లమెంటేరియన్ జాబితాలో చేరాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభిషేక్ రెండో సారి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అభిషేక్‌కు లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎంపీగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో అభిషేక్ కీలకంగా వ్యవహరించేవారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ తర్వాత కీలకంగా వ్యవహరించారు. టీఎంసీ భారీ విజయం సాధించడంతో తనదైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే అతనికి కష్టానికి గుర్తింపుగా కీలక బాధ్యతలు అప్పజెప్పినట్టు టీఎంసీ నేత ఒకరు చెప్పారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Mamata Banerjee, Trinamool congress, West Bengal

  ఉత్తమ కథలు