హోమ్ /వార్తలు /national /

టీజేఎస్‌కు నిరసన సెగ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న కార్యకర్త

టీజేఎస్‌కు నిరసన సెగ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న కార్యకర్త

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైల్ ఫోటో(Image:Facebook)

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైల్ ఫోటో(Image:Facebook)

టీజేఎస్ తరుపున మహబూబ్ నగర్ టికెట్ రాజేందర్‌ అనే అభ్యర్థికి ఇవ్వాలని కోరుతూ కొంతమంది నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

  మహాకూటమి సీట్ల పంచాయితీ కాంగ్రెస్‌కు పెద్దల తలనొప్పిగా మారింది. జాబితా ప్రకటనపై లీకులు తప్ప ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు. దీంతో అసంతృప్త నేతలు గాంధీభవన్ ముందు చేరి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కే కాదు.. టీజేఎస్ పార్టీకి కూడా ఈ సెగ తగలుతుండటం గమనార్హం.

  టీజేఎస్ తరుపున మహబూబ్ నగర్ టికెట్ రాజేందర్‌ అనే అభ్యర్థికి ఇవ్వాలని కోరుతూ కొంతమంది నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో మల్లేశ్ అనే ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిరసన వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కోదండరాం కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

  కూటమి నేతల భేటీ:

  కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా ఎటూ తేలకపోవడం ఆ పార్టీల నేతలు నేడు నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మరోసారి చర్చలు జరిపారు. ఆదివారం రాత్రి వరకు సీట్ల పంపకాలు కొలిక్కి రావాలని వారు భావిస్తున్నారు. సీపీఐ ఐదు స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. టీజేఎస్ మరో మూడు నాలుగు స్థానాల కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు