హోమ్ /వార్తలు /national /

రామగుండం నుంచి కోదండరాం... టీజేఎస్ అభ్యర్థులు వీరే…

రామగుండం నుంచి కోదండరాం... టీజేఎస్ అభ్యర్థులు వీరే…

కోదండరాం తదితరులు(Image: Facebook)

కోదండరాం తదితరులు(Image: Facebook)

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం రామగుండం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా కూడా కాంగ్రెస్‌కు అందినట్టు తెలుస్తోంది.

  కోదండరాం నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీజేఎస్(తెలంగాణ జనసమితి)కి మహాకూటమిలో ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. రాహుల్ గాంధీతో కోదండరాం సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అయితే టీజేఎస్‌కు లేదా ఎనిమిది సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు కావాల్సిన సీట్ల జాబితాను ఇప్పటికే టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అందజేసిందని... అందులో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీకి ఇచ్చిందని సమాచారం.

  వీటిలో రామగుండం, ఎల్లారెడ్ , మల్కాజ్ గిరి, మిర్యాలగూడ, చెన్నూరు, వర్ధన్నపేట, తాండూరు స్థానాలను టీజేఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో రామగుండం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎల్లారెడ్డి నుంచి రచనారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి దిలీప్ కుమార్, మిర్యాలగూడ నుంచి విద్యాధరరెడ్డి, చెన్నూరు నుంచి వినోద్, వర్ధన్నపేట నుంచి చింతస్వామి, తాండూరు నుంచి మర్రి ఆదిత్యారెడ్డి( కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తనయుడు) పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. మరో ఒకటి రెండు సీట్లు కోదండరాంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం పాతబస్తీలోని ఒక స్థానం కూడా ఆ పార్టీకి ఇవ్వొచ్చిన తెలుస్తోంది. మొత్తానికి టీజేఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని... ఆ పార్టీ తరపున ఎవరెవరు బరిలో ఉంటారనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు