హోమ్ /వార్తలు /national /

Tirupati by-poll: తిరుపతి ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ నాయకుల కీలక భేటీ.. ఏయే అంశాలు చర్చించారంటే..

Tirupati by-poll: తిరుపతి ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ నాయకుల కీలక భేటీ.. ఏయే అంశాలు చర్చించారంటే..

తిరుపతి ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ సమాలోచనలు..

తిరుపతి ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ సమాలోచనలు..

Janasena - BJP: ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బీజేపీ-జనసేనల మధ్య హైదరాబాద్‌లో కీలక భేటీ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బీజేపీ-జనసేనల మధ్య హైదరాబాద్‌లో కీలక భేటీ జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై ఇరు పార్టీల నేతల ప్రధానంగా చర్చించాయి. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జనసేన, బీజేపీ నాయకులను, శ్రేణులను సమాయత్తం చేయడంపై దృష్టి ఇరు పార్టీలు సారించినట్టుగా జనసేన పార్టీ వెల్లడించింది. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్, బీజేపీ నుంచి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ బీజేపీ వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.

ఈ బేటీ సందర్భంగా.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించడంపై వంటి విషయాలపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి మరో దఫా చర్చలు జరపాలని నేతలు భావించారు. జనసేన, బీజేపీలకు సంబంధించిన అభ్యర్థులను పరిశీలించి.. సమర్థవంతమైన అభ్యర్థిని బరిలో నిలపాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

అలాగే ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ బేటీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో చర్చించినట్టు జనసేన పార్టీ వెల్లడించింది. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదని నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని, అలా గౌరవించని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని నాయకులు అభిప్రాపడ్డారు. జగన్ సర్కార్ వైఖరిని బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు.. ఇక తన దృష్టి అంతా వాటిపైనే అని వెల్లడి

ఇక, ఈ భేటీకి ముందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చినట్టుగా సమాచారం. ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ జనసేన-బీజేపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పార్టీ పీఏసీ సమావేశంలోనూ, ప్రెస్ మీట్లోనూ పవన్ చేసిన కామంట్స్ బీజేపీలో కలకలం రేపాయి. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనన్న పవన్.., బీజేపీ నేతలు తొందరపాటు ప్రకటనలు చేస్తున్నారంటూ మిత్రపక్షానికి కౌంటర్ వేశారు.

First published:

Tags: Ap bjp, Janasena, Pawan kalyan, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు