హోమ్ /వార్తలు /national /

బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష

బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష

నందమూరి బాలకృష్ణ (Balakirshna)

నందమూరి బాలకృష్ణ (Balakirshna)

అక్రమాస్తుల కేసులో నందమూరి బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌కు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు విధించింది.

  సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ(వ్యక్తిగత సహాయకుడు) శేఖర్‌కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2008లోనే శేఖర్‌పై ఏసీబీ కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా తిరుపతి,ఎమ్మార్ పల్లి,మదనపల్లి తదితర ప్రాంతాల్లో దాదాపు కోటిన్నర విలువైన ఆస్తులున్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో సూపర్ వైజర్‌గా చేరిన శేఖర్ వివిధ హోదాల్లో పని చేశారు.

  అనంతరం హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణకు పీఏగా పని చేసిన బాలకృష్ణపై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో హిందూపురానికి చెందిన టీడీపీ శ్రేణులు సైతం శేఖర్‌ను పీఏగా తొలగించాలని బాలకృష్ణను కోరారు. ఈ మేరకు ఆందోళనలను కూడా చేశారు. విషయం చంద్రబాబు వరకు వెళ్లడంతో... అప్పట్లో శేఖర్‌ను తన పీఏ పోస్టు నుంచి బాలకృష్ణ తొలగించారు. ప్రస్తుతం శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Balakrishna, Hindupuram, TDP

  ఉత్తమ కథలు