హోమ్ /వార్తలు /national /

TELANGANA: బొగ్గుగని జోలికొస్తే బొగ్గైపోతారంతే.. కేంద్రంపై గులాబీ ఎమ్మెల్యేలు గుస్సా

TELANGANA: బొగ్గుగని జోలికొస్తే బొగ్గైపోతారంతే.. కేంద్రంపై గులాబీ ఎమ్మెల్యేలు గుస్సా

TRS vs BJP

TRS vs BJP

Mancherial: తెలంగాణ సింగరేణి బొగ్గుగనిలో 4బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ముగ్గురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్న కేంద్రం తీరును తప్పుపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు.

ఇంకా చదవండి ...

(Katta lenin,adilabad, new18)

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి బొగ్గుగనిలోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల (Mancherial)జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు( Three TRS MLAs)నిరాహారదీక్ష(Hunger strike)కు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన శ్రీరాంపూర్ లో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు(Divakar rao),మందమర్రి(Mandamarri)లో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్(Balka suman), బెల్లంపల్లిలో బెల్లంపల్లి (Bellampalli)ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam chinnaiah)సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీరాంపూర్ (Srirampur)లోని సిసిసి కార్నర్ దగ్గర ఎమ్మెల్యే దివాకర్ రావు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. సింగరేణి సంస్థ(Singareni coal mine)లో రాష్ట్ర ప్రభుత్వం వాట 51% ఉందని, ఈ సంస్థను ప్రైవేటీకరణ కాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే తెలంగాణ రాష్ట్ర విభజనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని రిప్రజెంటేషన్ చేస్తామని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.

బొగ్గు గని జోలికొస్తే ఊరుకోం..

మందమర్రి మార్కెట్ ఏరియా లో నిరాహార దీక్ష చేపట్టిన చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. సింగరేణి వ్యాప్తంగా ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి ఉత్తరాలు రాసినప్పటికీ కూడా స్పందించడం లేదని ఆరోపించారు బాల్క సుమన్. కేంద్రానికి పన్నుల రూపంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదాయం వెళ్తుంటే నిధులను మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తు తెలంగాణకు కొర్రి పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు బాల్కసుమన్.

కేంద్రంతో దేనికైనా సై..

శ్రీరాంపూర్ లోని సిసిసి కార్నర్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి అనంతరం నిరాహార దీక్షలో కూర్చున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు దివాకర్‌రావు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిలో ప్రైవేటు పెట్టుబడుల పేరుతో కార్మికుల భవిష్యత్‌పై కేంద్రం దెబ్బకొట్టాలని చూస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని పక్కనపెట్టి సింగరేణిలోని 4బొగ్గు బ్లాకుల వేలంను ఉపసంహరించుకొని వాటిని సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు.


ఒక్కరోజు నిరాహార దీక్ష..

బెల్లంపల్లి లో ఒకరోజు దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగట్టారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

First published:

Tags: Bjp, Singareni Collieries Company, TRS leaders