ఇటీవల ఏపీలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్.. మళ్లీ ఇందుకు సంబంధించి సమగ్రమైన, సవివరమైన బిల్లును సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై మళ్లీ బిల్లు తీసుకొస్తామన్న ఏపీ ప్రభుత్వం.. ఆ బిల్లును ఎఫ్పుడు తీసుకొస్తామనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మూడు రాజధానులకు సంబంధించి మరో బిల్లు ప్రవేశపెట్టే విషయంలో వైసీపీ ప్రభుత్వం మరికొంత సమయ తీసుకుంటుందని.. ఈ విషయంలో జగన్ సర్కార్ మరోసారి తొందరపాటుగా ముందుకు వెళ్లదనే విశ్లేషణలు వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకు సంబంధించిన సవరణ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యల చేశారు. చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని.. ఆయనను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు రాజధానుల బిల్లుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఈ మేరకు ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత నెల 24న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బిల్లును తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. తన ఇల్లు కూడా ఉందన్నారు. నిజానికి ఈ ప్రాంతమంటే తనకు ప్రేమ ఉందన్నారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్ష కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు.
వాస్తవాలను గుర్తించి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాకపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల త్యాగాన్ని, ఆకాంక్షలను గుర్తించి న్యాయరాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు.
KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..
ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?
Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి
మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..
ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత రకరకాలుగా వక్రీకరిస్తూ, అపోహలు సృష్టిస్తూ, న్యాయపరమైన చిక్కులు సృష్టించారన్నారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగుపచేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సవివరమైన బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని జగన్ ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Balineni srinivas reddy