హోమ్ /వార్తలు /జాతీయం /

PM Modi: దేశ చరిత్రలో తొలిసారి 4-5 మినీ బడ్జెట్‌లు: ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi: దేశ చరిత్రలో తొలిసారి 4-5 మినీ బడ్జెట్‌లు: ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ తర్వాత తొలి బడ్జెట్ కావడంతో దీనిపై దేశ ప్రజల్లో ఎన్నో అంచనాలున్నాయి.

భారత్‌కు బంగారు భవిష్యత్‌ అందించేందుకు ఈ దశాబ్దం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చట్ట సభల్లో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆయన పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం నేపథ్యంలో సమావేశాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్ర్య సమర యోధుల కలలను సాకారం చేసేందుకు సువర్ణ అవకాశం ఇప్పుడు వచ్చిందని.. ఆ దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

''ఇవాళ్టి నుంచి ఈ దశాబ్దపు మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. భారత అద్భుతమైన భవిష్యత్‌ అందించేందుకు ఈ దశాబ్దం ఎంతో కీలకం. భారత స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలను సాకారం చేసేందుకు ఇది సువర్ణ అవకాశం. ఈ దశాబ్ద కాలాన్ని చక్కగా వినియోగించుకోవాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలు జరగాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మనందరం కృషి చేస్తామని విశ్వసిస్తున్నా. ఇవి బడ్జెట్ సమావేశాలు. గత ఏడాది భారత చరిత్రలో తొలిసారిగా పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్‌లను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. ఇది కూడా అందులో భాగమే.'' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.


శుక్రవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. లాక్‌డౌన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎర్రకోటపై జాతీయ పతాకానికి అవమానం జరగడం, జనవరి 16న జరిగిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ తర్వాత తొలి బడ్జెట్ కావడంతో దీనిపై దేశ ప్రజల్లో ఎన్నో అంచనాలున్నాయి.

First published:

Tags: Indian parliament, Parliament, PM Narendra Modi

ఉత్తమ కథలు