హోమ్ /వార్తలు /national /

Telangana Congress: మరోసారి కాంగ్రెస్ లో కుమ్ములాట.. వీహెచ్ ను అడ్డుకున్న ఆ వర్గీయులు.. ఏం జరుగుతోంది..?

Telangana Congress: మరోసారి కాంగ్రెస్ లో కుమ్ములాట.. వీహెచ్ ను అడ్డుకున్న ఆ వర్గీయులు.. ఏం జరుగుతోంది..?

ఘటనా స్థలం వద్ద హనుమంతరావు

ఘటనా స్థలం వద్ద హనుమంతరావు

ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నా వేదిక సాక్షిగా పార్టీలోని కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

ధాన్యం(Grain) కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య (praja chaitanya) యాత్రలో భాగంగా మంచిర్యాల(Manchiryala) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ (Collector) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నా వేదిక సాక్షిగా పార్టీలోని కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. మొదట మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. రైతుల కల్లాల్లో ఉన్నధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

MLC Elections: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారితే ఇలా చేస్తారా.. ఈ సారి తాడో పేడో తేలాల్సిందే..అంతలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి జి. వినోద్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , ఐఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ రావడంతో అక్కడే ఉన్న ప్రేమ సాగర్ రావు వర్గీయులు కలెక్టరేట్ గేటు ముందు వారి వాహనాలను అడ్డుకున్నారు. గో బ్యాక్ హనుమంతరావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హనుమంతరావు డౌన్ డౌన్ అంటూ పి ఎస్ ఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వారి వాహనాలను కలెక్టరేట్ లోపలికి పోకుండా అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని హనుమంతరావు, మాజీ వినోద్, రాములు నాయక్ లను లోపలికి పంపించారు. హనుమంతరావు తో పాటు వీరు లోపలి వెళ్లి అదనపు కలెక్టర్ మధు సూదన్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు.

Bigg Boss Telugu 5: 11వ వారం నామినేషన్లో ఉన్నది ఎవరో తెలిసింది.. డేంజర్లో వాళ్లే..


కాగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు అనుసరించిన తీరుపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఇతర పార్టీల వారు కూడా తనను అడ్డుకోలేదని, కానీ మంచిర్యాలలో పిఎస్ ఆర్ వర్గీయులు మాత్రమే అడ్డుకున్నారని దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పిసిసి ఆదేశాల మేరకే తాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తిరుగుతూ రైతు కష్టాలను అడిగి తెలుసుకుంటూ అక్కడే ఉండి అధికారులతో మాట్లాడి కొనుగోలు చేయాలని కోరుతున్నానని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు ఏమైనా సమస్య ఉంటే అధిష్ఠానంతో మాట్లాడాలని ఇలా చేయడం పద్ధతి కాదని , పార్టీ కష్టకాలంలో ఉంటే ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల పార్టీ బలహీన పడుతుందని తెలిపారు.

Hyderabad Sisters: వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. ఉదయం 5 గంటలకు నిద్రలేచి వాళ్లు ఏం చేస్తారో తెలుసా..


ఇదిలా ఉంటే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కేంద్రం ప్రకటించిన 23 పంటలకు మద్దతు ధర జాబితాలో వరి కూడా ఉందని ఎందుకు కొనుగోలు చేయడం లేదని విహెచ్ ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో శాస్త్రీయత లేకుండా అగమ్యగోచరంగా మార్చారని, రైతులకు డబ్బులు చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చానని తెలిపారు.

Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల బాగోగులపై చూపడం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర, మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

First published:

Tags: Congress ts, Manchirala, VHP