ప్రతీ గ్రామంలో కూడా అనేక రకాల అమ్మవారి ఆలయాలు, గ్రామ దేవతల గుళ్లు ఉంటాయి. ఆ ఊరికి.. ఆ పల్లెకు ఆ దేవత అండగా ఉంటుందని స్థానికులు నమ్ముతుంటారు. అయితే మాములుగా ఏ చిన్న గుడి అయినా.. దానికి ఓ గోపురంలా కట్టి ఆలయం నిర్మిస్తారు. కానీ ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఈ గుడి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ అమ్మవారికి గుడిలాంటిది ఉండదు. ఓ చెట్టు కింద అమ్మవారు కొలువయ్యారు. అక్కడే భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయం అఘనాశిని నది ఒడ్డున ఉంటుంది. దీవగి నుంచి మనకోన వెళ్లే దారిలో ఈ ఆలయం మనకు కనిపిస్తోంది. అంతేకాదు.. ఏడాదికి 8, 9 నెలలు నీటిలోనే ఉంటుంది. నది ఎండిపోయిన తర్వాత.. కేవలం వేసవిలో మాత్రమే ఈ అమ్మవారు కనిపిస్తుంది.
ఈ ఆరాధ్య దేవత పేరు బంగారమ్మ దేవి. పేదలకు బంగారమే ఇచ్చేది ఈ అమ్మ. ఆమె కథ కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ బంగారమ్మ దేవి ఆలయం ఉత్తర కన్నడలోని కుమటాలోని దీవాగి నుండి మనకోనకు వెళ్లే మార్గంలో అఘనాశిని బ్యాక్ వాటర్‌లో కనిపిస్తుంది. అఘనాశినీ నదీ తీరమే అమ్మవారికి సర్వస్వం. తనను వెతుక్కుంటూ వచ్చే భక్తులను ఎలా పంపించాలో ఈ గ్రామదేవతకు మాత్రమే తెలుసు. ఆమెకు మహాసతి వృక్షమే ఆసరా. ఇక్కడ మనం దేవత ముఖం మాత్రమే చూడగలం.
నమ్మిన వారికి నగలు ఇచ్చిన దేవత!
ఆ ఊరిలో ఏ పెళ్లి జరిగినా అప్పట్లో జనాల దగ్గర అంత బంగారం ఉండేది కాదు కాబట్టి అమ్మవారి బంగారాన్ని తీసుకుని వెళ్లి పెళ్లి కూతురికి అలంకరించేవారు. పెళ్లి అయ్యాక తిరిగి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించేవారు. కానీ ఊరిలో అపచారం జరగడం వల్ల ఆ తర్వాత ఆ పద్ధతి మానేశారు. జనాలకు బంగారం ఇచ్చేది కాబట్టి ఈ దేవత బంగారమ్మ తల్లి అయ్యింది. నిరుపేదలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ముందుగా ఈ అమ్మవారి ఆభరణాలను గ్రామ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగించేవారు.
ఒక్కసారి దేవతకు అపచారం చేసినందుకు దేవుడి నగలు బయటకు ఇవ్వడం మానేశారు. ఈ సంప్రదాయం 50 - 60 ఏళ్ల క్రితం ఉండేది. ఆ తర్వాత లేదు. ప్రస్తుతం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బంగారం, ఆతర ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లలు కలగని వారు ఈ దేవత వద్దకు వచ్చి వెండి ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.