రెండు రోజుల క్రితం కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడం, పోలీస్ విధులను అడ్డుకోవడంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట (Bandi sanjay release) లభించింది. వెంటనే విడుదల (Release) చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్యాష్ చేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బండి సంజయ్ తరపు న్యాయవాది మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 7కి విచారణ వాయిదా..
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేసింది. వెంటనే సంజయ్‌ను విడుదల చేయాలని (Bandi sanjay release) జైళ్ల శాఖ డీజీకి హైకోర్టు ఆదేశించింది. రూ. 40 వేలు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు (Orders) జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. కాగా, కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ తో సహా 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు బండి సంజయ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే కోర్టులో హాజరుపరిచారు . మిగతా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
రోస్టర్ లేదని తిరస్కరణ..
అయితే మంగళవారం బండి సంజయ్ బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. దీంతో నేడు మరోసారి విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం బెంచ్ సంజయ్‌కు వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ (Bail) మంజూరు చేసింది.
దూకుడు మీదున్న బీజేపీ నాయకత్వం..
కాగా, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుతోపాటు ఒక ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం వెనక రాజకీయ కోణాలు కనిపిస్తున్నట్టు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. .అందుకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు.. మరోవైపు సంజయ్ అరెస్ట్ తర్వాత 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.
బండి సంజయ్ అరెస్ట్ పరిణామాలపై కిషన్ రెడ్డి దృష్టి సారించారు.. ఆయన సైతం ఉదయమే జైల్లో ఉన్న బండి సంజయ్‌కు పరామర్శించేందుకు నేరుగా జైలుకు వెళ్లారు. ఆయన్ను జైల్లో పరామర్శించిన అనంతర సంజయ్ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత గాయాల పాలైన కార్యకర్తలను కూడా ఆయన పరామర్శించారు. ఇలా ఉన్నత స్థాయి నేతలు డైరక్టుగా రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయినట్టు కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ సైతం కేంద్రాన్ని ఇదివరకే వరి విషయంలో టార్గెట్ చేశారు. ఆ తర్వాత ధర్నాలు, విమర్శలతో కేంద్రంపై దుమ్మెత్తి పోశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Telangana