హోమ్ /వార్తలు /national /

Telangana assembly: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్​ తమిళిసైకి సీఎం కేసీఆర్​ మరో షాక్​..

Telangana assembly: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్​ తమిళిసైకి సీఎం కేసీఆర్​ మరో షాక్​..

తెలంగాణ‌ (Telangana)లో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయాలు కీల‌క మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీఆర్​ఎస్​ అధినేత (CM KCR) వేస్తున్న అడుగులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai soundararajan) మ‌ధ్య దూరం పెరుగుతోందా? అనే చ‌ర్చ మొద‌లైంది.

ఇంకా చదవండి ...

  నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ (CM KCR).. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు (Telangana assembly) ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. కాగా. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. అయితే బడ్జెట్ సమావేశాలకు (Budget sessions) సంబంధించి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

  గవర్నర్​ లేకుండానే..

  మార్చి 7 వ తేదీన తెలంగాణ  గవర్నర్ (Governor Tamilisai) ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana assembly) నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకముందు 1970, 2014 లలో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

  తెలంగాణ‌ (Telangana)లో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయాలు కీల‌క మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీఆర్​ఎస్​ అధినేత (CM KCR) వేస్తున్న అడుగులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai soundararajan) మ‌ధ్య దూరం పెరుగుతోందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి స్ప‌ష్టమైన స‌మాధానం రాక‌పోయినా.. అవుననే రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

  కొద్దిరోజుల ముందే గవర్నర్​ తమిళిసైకి మేడారం జాతరలో మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడం చర్చనీయాంశం అయింది.  ముంబైలో ఉద్ధవ్​ ఠాక్రేను కలవడానికి వెళ్లే ముందు కేసీఆర్​ బీజేపీకి జలక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ఇపుడు ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో  (Telangana assembly) గవర్నర్​ ప్రసంగం లేకుండా చేయడం చర్చనీయాంశమైంది.

  అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో గవర్నర్​ విషయంలో పెద్దగా వ్యతిరేకత లేదన్నది పలువురి వాదన, కానీ, ఇటీవలె ఎమ్మెల్సీల ఎంపిక సమయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) కొంత తాత్సారం చేసిన సంగతిని టీఆర్​ఎస్​ శ్రేణులు గుర్తుచేస్తున్నారు.

  రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లోనూ..

  గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) జాగ్ర‌త్త‌గా ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. అయితే, రాజ్ భ‌వ‌న్‌, సీఎం కార్యాల‌యం మ‌ధ్య దూరం పెరుగుతున్న‌ద‌ని రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌ర‌గ‌డానికి రిప‌బ్లిక్ డే వేడుక‌లు కేంద్ర బిందువుగా మారాయి. రాజ్‌భ‌వ‌న్ లో జ‌రిగిన రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) హాజ‌రు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవ‌రూ హాజ‌రు కాలేదు. మేడారంలోనూ అదే జరిగింది. ఇక బడ్జెట్​ సమావేశాల్లోనూ గవర్నర్​కు చేదు అనుభవం ఎదురవనున్నట్లు తెలుస్తోంది.

  గవర్నర్​ తమిళిసైకి మంత్రులు స్వాగతం పలకలేదు. దీంతో బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లకు, సీఎంలకు మధ్య అంతగా సఖ్యత లేదు. దీనిపై పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్​ సైతం వ్యాఖ్యానించారు. కేంద్రం గవర్నర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకుంటోందని ఆరోపణలు సైతం చేశారు.

  First published:

  Tags: CM KCR, Governor Tamilisai, Telangana Assembly, Telangana Budget 2022

  ఉత్తమ కథలు