హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#AmitShahToNews18 | ఆర్థిక మందగమనంపై స్పందించిన అమిత్ షా

#AmitShahToNews18 | ఆర్థిక మందగమనంపై స్పందించిన అమిత్ షా

అమిత్ షా

అమిత్ షా

ఆర్థిక మందగమనం అనేది ఒక్క భారతదేశంలోనే లేదని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థం అవుతోందన్నారు.

దేశంలో ఆర్థిక మందగమనంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. నెట్‌వర్క్ 18 ఎండీ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, హాట్ టాపిక్స్ మీద స్పందించారు. ఆర్థిక మందగమనం అనేది ఒక్క భారతదేశంలోనే లేదని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థం అవుతోందన్నారు. వాటితో పోలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ‘ఆర్థిక మందగమనం గురించి రెండు రకాలుగా చెప్పాలనుకుంటున్నా. మొదటిది 1990 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సరళీకృతమైంది.’ అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోనే చాలా దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆ క్రమంలో భారత్ కూడా ఆర్థికంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని తెలిపారు. టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల జీడీపీ ఎంత పడిపోయిందో పరిశీలిస్తే.. భారత్‌లో జీడీపీ ఎంత దిగువకు చేరిందో వాస్తవంగా అవగతం అవుతుందన్నారు.

ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని వివిధ రంగాల వ్యాపారవేత్తలతో చర్చల జరుపుతున్నారని అమిత్ షా తెలిపారు. ఆర్థికవేత్తలు, ఆడిటర్లతో కూడా చర్చిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకునే నిర్ణయాలు ఆర్ధిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేస్తాయిన అమిత్ షా ఆకాంక్షించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అనేది దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఏడాది వర్షాలు కూడా బాగానే పడ్డాయని, సాధారణం కంటే ఈ సంవత్సరం 5 నుంచి 6లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగులోకి వచ్చాయన్నారు.

మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యల మీద తాను స్పందించబోనని అమిత్ షా అన్నారు. కేంద్రంలో నిర్ణయాలు అన్నీ కేంద్రీకృతంగా నడుస్తున్నాయంటూ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ‘నేను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదు. అయితే, పార్లమెంటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.’ అని అమిత్ షా అన్నారు.

First published:

Tags: Amit Shah, Network18, News18

ఉత్తమ కథలు