హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్‌కు మరోసారి ‘రాజస్థాన్’ తలనొప్పి.. మల్లికార్జున ఖర్గే పరిష్కరిస్తారా ?

Congress: కాంగ్రెస్‌కు మరోసారి ‘రాజస్థాన్’ తలనొప్పి.. మల్లికార్జున ఖర్గే పరిష్కరిస్తారా ?

అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, సచిన్ పైలెట్ (ఫైల్ ఫోటో)

అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, సచిన్ పైలెట్ (ఫైల్ ఫోటో)

Congress: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని సచిన్ పైలట్ ఉద్ఘాటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. అయితే ఈసారి ఈ చర్చ రాజస్థాన్‌లో జరుగుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫోటోలు ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నాయి. ఓ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనకు సంబంధించి, సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులు ఆజాద్‌ను గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ నుండి నిష్క్రమిస్తున్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ఆయనను ప్రశంసించారు. ఆ రోజు ప్రధాని మోదీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. చివరికి ఆజాద్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి సొంత పార్టీని స్థాపించినప్పుడు, ఆజాద్ చాలా కాలం క్రితమే బీజేపీతో ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రధాని ఉద్వేగభరితమైన క్షణం స్పష్టం చేసిందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. .

సచిన్ పైలట్(Sachin Pilot) ప్రకటన తర్వాత, రాష్ట్రంలోని పైలట్ మద్దతుదారులు కూడా అదే విషయాన్ని పునరావృతం చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) మాజీ సీఎం వసుంధర రాజే, బీజేపీకి సన్నిహితుడని చెప్పారు. అశోక్ గెహ్లాట్ సీఎం పదవిలో కొనసాగాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీకి అధికారం దక్కడం సులువవుతందని ఆరోపించారు. సచిన్ పైలట్‌ను సీఎం చేసి ఉంటే బీజేపీకి పెద్ద సవాల్‌గా ఉండేదని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని సచిన్ పైలట్ ఉద్ఘాటించారు. నాయకత్వ సమస్యను పరిష్కరించేందుకు పిలిచిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశానికి హాజరు కానందుకు గెహ్లాట్‌కు సన్నిహితంగా భావిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ నాయకత్వ పోరాటాన్ని పరిష్కరించడానికి ఇద్దరినీ పంపారు. కానీ ఏం చేయలేక తిరిగి వెనక్కి వచ్చేశారు. ఆ తరువాత పరిస్థితులు సద్దుమణిగాయి.

Viral video: ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్‌కు తాంత్రికుడి ట్రీట్‌మెంట్ .. మహిళను ఏం చేశాడో ఈ వీడియో చూడండి

Good News To Farmers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఎరువులపై సబ్సిడీకి ఆమోదం

అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి ఖర్గే వచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ అండతో కాంగ్రెస్‌కు కొత్త బాస్ అయ్యారు. ఇప్పుడు సచిన్ పైలెట్ మళ్లీ కొత్త వాదనను తెరపైకి తీసుకురావడంతో.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైంది. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం.. అందులోనూ పార్టీకి కొత్త బాస్‌గా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఏ విధంగా పరిష్కరిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Congress, Rajasthan

ఉత్తమ కథలు