Home /News /national /

POLITICS THE MODI MAGIC AND COMBO OF MODI AMIT SHAH BOOSTED BJP VICTORY WITH NEW ELECTION GRAMMAR MKS

BJP: బీజేపీ విజయ రహస్యం ఏంటో తెలుసా? ఎన్నికల సిలబస్‌లో గెలుపు గ్రామర్ ఇదే..

మోదీ-షా

మోదీ-షా

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను రెండవసారి కూడా సీఎం అభ్యర్థిగా ఢిల్లీలోని సీనియర్ నాయకులు నామినేట్ చేసినా.. యూపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారకుడు, క్రౌడ్-పుల్లర్, పార్టీని నడిపించేది ప్రధానమంత్రే అనేది కాదనలేని వాస్తవం.

దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఉత్కంఠతో పరిశీలించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా రెండోసారి విజయాన్ని నమోదు చేసుకుంది. అతిపెద్ద రాష్ట్రం యూపీలో 37ఏళ్ల తర్వాత ఒక పార్టీ, ఒక సీఎం(యోగి) వరుసగా రెండు సార్లు ఎన్నిక కావడం ఒక రికార్డు. కరోనా అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు, పెట్రోల్ సహా నిత్యావసర సరుకుల భగభగ, ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమం, అంతర్జాతీయంగా చర్చకు నిలిచిన హింసాకాండ ఘటనలు, ఐదేళ్ల తర్వాత సహజంగానే ప్రభుత్వంపై ఏర్పడే వ్యతిరేకత, విపక్షాల ఐక్యత.. ఈ అంశాలేవీ కూడా బీజేపీ గెలుపును అడ్డుకోలేకపోయాయి. అయితే కమలదళం విజయంలో పనిచేసిన ఏకైక విజయమంత్రం ‘మోదీ’నే. 2014 తర్వాత ఎన్నికల సిలబస్ లో మారిపోయిన గ్రామర్ ను మోదీ-అమిత్ షా కాబినేషన్ ఎలా లిఖించిందంటే..

2014లో అఖండ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నికల గమనంలో అనేక ఎత్తులు, పతనాలు, రకరకాల మలుపులు ఉన్నాయి. అయితే ప్రతి ఎన్నికలోనూ స్క్రిప్టు మాత్రం ‘మోదీకే మీ ఓటు’అన్నట్లుగా సాగింది. గత ప్రధానులకు భిన్నంగా రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలకు కూడా బీజేపీకి మోదీనే ముఖచిత్రంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో హోరాహోరీ అనుకున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ మోదీ మ్యాజిక్ వల్ల సునాయాసంగా బీజేపీకి ఫేవర్ అయ్యాయని చెప్పొచ్చు.

BJP తర్వాతి టార్గెట్ KCR: యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయి.. ముందస్తు ప్లాన్ చెప్పేసిన నేత


యూపీ ఎన్నికల్లో పోస్టర్ల దగ్గర్నుంచి ప్రచారం దాకా అన్ని చోట్లా ‘డబుల్ ఇంజన్’ నినాదం హోరెత్తింది. ఇది పీఎం మోదీ-సీఎం యోగిల కలయికను సూచిస్తుంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency)ని అధిగమించి మరీ యోగి వరుసగా రెండోసారి విజయం సాధించడంలో ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణే ఎక్కువగా కారణమని చెప్పవచ్చు. 2014 తర్వాత ఎన్నికల సిలబస్ లో గెలుపు గ్రామర్ గా మోదీ మేనియాను సెట్ చేయడంలో ఆయనతోపాటు అమిత్ షా చాణక్యం ఎలా పనిచేసిందంటే..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అడుగుజాడలను కించిత్ తప్పకుండా.. అహ్మదాబాద్ నుంచి హస్తిన వరకు ఎదిగొచ్చిన మోదీ-షా ద్వయం పార్టీ పాదముద్రలను దేశమంతటా విస్తరించడానికి కొత్తకోణాల్లో సరికొత్త వ్యూహాలెన్నింటినో అమలు చేశారు. టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవడం, స్మార్ట్ ఫోన్ల యుగాన్ని అనుకూలంగా మలుచుకోవడం, సంప్రదాయ(మెయిన్ స్ట్రీమ్) మీడియాను పక్కనపెట్టేసి బహుళ ప్రజానీకంతో ప్రత్యక్షంగా సంబంధాన్ని ఏర్పరచుకోవడం, పార్టీ హైరార్కీ విధానంలో కాకుండా నేరుగా కిందిస్థాయి కార్యకర్తలకే వినబడేలా, కనబడేలా మోదీ-షా సృష్టించిన వ్యవస్థ బీజేపీని అసాధారణ స్థాయిలో నిలబెట్టింది. ఎన్నికల విషయానికొస్తే..

సైలెంట్ కిల్లర్ Kejriwal: ఏ ప్రాంతీయ పార్టీకీ సాధ్యంకానిది.. KCR హడావుడి, Mamata గర్జనకు భిన్నంగా..


రాజకీయాలు అనేవి ఎన్నికల్లో గెలుపు దిశగానే ఉండేలా, పార్టీని విన్నింగ్ మిషిన్ గా నిలబెట్టేలా మోడీ-షా ద్వయం రూపొందించిన కార్యక్రమాలు ఇప్పుడు ఎవరూ నిర్దేశించకుండానే మిషన్ మోడ్ లో సాగుతున్నాయని బీజేపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. ఏ చిన్న ఎన్నికనూ తేలికగా తీసుకోరాదనే స్ఫూర్తి.. అమిత్ షా ‘పంచాయితీ నుంచి పార్లమెంట్ దాకా’ అనే ఫార్ములా నుంచే ఉద్భవించిందని, ప్రతి ఎన్నికలో విజయంపై దృష్టితోనే ఇప్పుడు పార్టీ పోరాడుతోందంటోన్న నేతలు.. ఎన్నికల అంశాలు కూడా మోదీ-షా ద్వయం నిర్దేశించిన విధానంలోనే అప్ డేట్ అవుతుంటాయని చెబుతారు. ఉదాహరణకు..

సీఎంను ఓడించిన స్వీపర్ కొడుకు: పంజాబ్‌లో సంచలనం.. ఇక దేశాన్ని ఊడ్చేస్తామంటూ..


రాష్ట్ర ఎన్నికల విషయానికొస్తే, సోషల్ ఇంజనీరింగ్ తోపాటు అసెంబ్లీ ఎన్నికల అంశాలనూ మోదీ-షా మోడల్ కీలకంగా భావిస్తుంది. హైపర్‌ లోకల్ నుంచి గ్లోబల్ వరకు.. ఆయా సందర్భాల్లో నెలకొన్న అన్ని సమస్యల ప్రస్తావన మోదీ ప్రచారంలో వినిపించడం మనందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల అంశాలను కేవలం ఆ రాష్ట్రానికి పరిమితం చేయకుండా, దేశంపై ప్రభావం చూపించే అంశాలనూ అందులోకి చొప్పించడం ద్వారా విజయావకాశాలను విస్తృతం చేయడం మోదీ-షా స్టైల్ లో ఒక చిన్న భాగమని బీజేపీ సీనియర్లు చెబుతారు. జాతీయ భద్రత, దౌత్యం, పాన్ ఇండియన్ సమస్యలు ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాగంగా ఉన్నాయంటారు.

CM Yogi: యోగి ప్రభంజనం.. గోరఖ్‌పూర్‌లో 1లక్షకుపైగా మెజార్టీతో విజయం.. Lakhimpurలో బీజేపీ క్లీన్ స్వీప్


పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా అన్ని స్థాయిల ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి ముఖంతోనే పోటీ పడతామని అంగీకరించడానికి బీజేపీ కూడా వెనుకాడదు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను రెండవసారి కూడా సీఎం అభ్యర్థిగా ఢిల్లీలోని సీనియర్ నాయకులు నామినేట్ చేసినా.. యూపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారకుడు, క్రౌడ్-పుల్లర్, పార్టీని నడిపించేది ప్రధానమంత్రే అనేది తిరుగులేని వాస్తవం కూడా. దశాబ్దాల కిందట..

Punjab: చీపురు దెబ్బ: సిద్దు ఓటమి.. పీసీసీకి రాజీనామా.. తల్లిని పట్టుకొని ఏడ్చేసిన కాబోయే సీఎం


గతంలోనూ కేంద్రంలోని ప్రధాని బలమైన నేతగా ఉన్నప్పుడు.. రాష్ట్రాల్లో సీఎంలుగా ఎవరున్నప్పటికీ పర్వాలేదనే అభిప్రాయం ఉండేది. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్, జార్ఖండ్‌లో రఘుబర్ దాస్, త్రిపురలో బిప్లబ్ దేబ్ వంటి నియామకాలతోపాటు సీఎంలకు సహేతుకమైన, బలమైన మద్దతు ఉన్న రాష్ట్రాలలోనూ ప్రధానిదే మెయిన్ ఫొటోగా ఉండటం నిజమని బీజేపీ నేతలే చెబుతారు.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Assembly Election 2022, Bjp, Narendra modi, Pm modi, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

తదుపరి వార్తలు