హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కర్నాటకానికి నేడు తెర.. బలపరీక్ష నిర్వహించకపోతే ఆ పరిస్థితే..?

కర్నాటకానికి నేడు తెర.. బలపరీక్ష నిర్వహించకపోతే ఆ పరిస్థితే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేడు కర్ణాటక అసెంబ్లీ సాక్షిగా జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజకీయం అంటేనే ఊహించని పరిమాణాలకు అడ్డా.. అక్కడ ఏమైనా జరగొచ్చు.. ఏమీ జరగక ఊసురుమనిపించొచ్చు.. సంచలనాలకు తెర తీయొచ్చు.. ప్రస్తుతం అలాగే సాగుతోంది కర్ణాటక రాజకీయం. నాలుగైదు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఆ రాష్ట్ర రాజకీయాలు.. ఈ రోజు తీవ్ర స్థాయికి చేరాయి. గవర్నర్ ఆదేశాలను రెండు సార్లు ధిక్కరించిన ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి.. బలపరీక్షను నిరూపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. జేడీఎస్-కాంగ్రెస్ సర్కారును కాపాడుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. చివరికి సుప్రీం కోర్టు తలుపులను కూడా తట్టారు. అయితే, నేడు అసెంబ్లీ సాక్షిగా జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి, అసెంబ్లీలో ఈ రోజు ఏం జరగబోతోంది? కుమారస్వామి సీఎం పీఠాన్ని కాపాడుకుంటారా? బలపరీక్ష నిర్వహిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం మరికాసేపట్లో దొరకనుంది. ఓ వైపు ఈ రోజు కూడా బలపరీక్ష నిర్వహించే అవకాశం లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. బలపరీక్ష నిర్వహించలేకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక, హోటల్‌లో మకాం వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు కాసేపటి క్రితమే అసెంబ్లీకి బయలుదేరారు.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Hd kumaraswamy, Karnataka political crisis

ఉత్తమ కథలు