హోమ్ /వార్తలు /national /

సీబీఐ వర్సెస్ చంద్రబాబు... కేంద్రం, ఏపీ మధ్య పెరగనున్న గ్యాప్

సీబీఐ వర్సెస్ చంద్రబాబు... కేంద్రం, ఏపీ మధ్య పెరగనున్న గ్యాప్

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)

ప్రస్తుతం విధానపరంగానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు నడుస్తున్నాయి తప్పా... రాజకీయాలు, ఇతర కీలకమైన అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఉప్పు నిప్పులా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ... సీబీఐకు ఏపీలో అనుమతించమని చంద్రబాబు ప్రకటించారు. దీంతో కేంద్రం ఏపీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఏపీ సర్కార్‌కు, కేంద్రానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదాలు చినికి చినికి గాలి వానగా మరాయి. దీంతో ఎన్డీయే నుంచి బయటకొచ్చినప్పటి నుంచి టీడీపీ ...మోదీ సర్కార్‌పై విమర్శల జోరు పెంచింది. అయితే తాజగా సీబీఐకి ఏపీలో నో ఎంట్రీ అంటూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సైతం ఇదే హాట్ టాపిక్‌‌గా మారింది.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏపీ, కేంద్రం మధ్య ఉన్న దూరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిధుల విషయంలో కేంద్రం పితలాటకాలు ఆడుతుంది. ఏపీకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో మీనమేషాలు లెక్క పెడుతుంది. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన ఫండ్స్ కూడా రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోనే ప్రాజెక్టును చేపట్టలని డిసైడ్ అయ్యింది. మొన్న వచ్చిన తిత్లీ తుఫాను సమయంలో కూడా ఏపీపై కేంద్రం ఎలాంటి దయ చూపలేదు. కోట్లలో నష్టం వాటిల్లితే.. కేవలం నామమాత్రపు నిధులు మంజూరు చేసి చేతులు దులుపేసుకుంది.

ప్రస్తుతం విధానపరంగానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు నడుస్తున్నాయి తప్పా... రాజకీయాలు, ఇతర కీలకమైన అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఉప్పు నిప్పులా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ... సీబీఐకు ఏపీలో అనుమతించమని చంద్రబాబు ప్రకటించారు. దీంతో కేంద్రం ఏపీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిధుల కేటాయింపు విషయంలో కొర్రీలు పెడుతున్న కేంద్రం.. వాటి విడుదలను మరింత జాప్యం చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు పోలవరంతో పాటు అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. వాటికి కేంద్రం డబ్బులిస్తుందన్న మాట డౌట్‌గానే మారింది. అంతేకాకుండా రాష్ట్రానికి కొన్ని జాతీయ విద్యా సంస్థలు రావాల్సి ఉంది. వాటి విషయంలో కూడా కేంద్రం మోకాలడ్డే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కడప స్టీల్ ప్లాంట్‌కు కూడా మోదీ సర్కార్ కొర్రీలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు రాజకీయాల అవసరాల కోసమే రాష్ట్రాలపై కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతుందనే ఆరోపణలున్నాయి. నాలుగేళ్లుగా మోదీ, అమిత్ షా సీబీఐని తన సొంత సైన్యంలా వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో సీబీఐ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుందని. సొంతంగా వ్యవహరించలేకపోతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటి చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం... కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచే అవకాశం లేకపోలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Bjp-tdp, Chandrababu Naidu, Narendra modi

ఉత్తమ కథలు