హోమ్ /వార్తలు /national /

టీఆర్ఎస్, సీపీఐ... మధ్యలో ఆర్టీసీ... గులాబీ శ్రేణుల్లో టెన్షన్ ?

టీఆర్ఎస్, సీపీఐ... మధ్యలో ఆర్టీసీ... గులాబీ శ్రేణుల్లో టెన్షన్ ?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాాడా వెంకట్ రెడ్డి,సీఎం కేసీఆర్

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాాడా వెంకట్ రెడ్డి,సీఎం కేసీఆర్

ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో... టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసే విషయంలో సీపీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ... ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో సపోర్ట్‌పై వెనక్కి తగ్గుతుందా ? ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందా ? ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై ప్రభుత్వ వైఖరి గురించి చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశమైంది. సీపీఐ ముఖ్యనేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

  ఈ సమావేశంలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 13లోపు చర్చలు జరపాలని సీపీఐ గతంలోనే ప్రభుత్వానికి సూచించింది. ఈ గడువు ముగియడం... ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో... హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఇంకా టీఆర్ఎస్‌కు మద్దతిస్తే కార్మికులు దృష్టిలో తాము విలన్‌గా మిగిలిపోతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

  దీంతో ఆర్టీసీతో చర్చలపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడమో లేక హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవడమో చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ భేటీలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో సీపీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, CPI, Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Rtc jac, Trs, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు