Comedian Riyaz Political Entry: తెలుగు బుల్లి తెరపై ప్రసారమైన ‘అదిరింది’ కామెడీ షో (Comedy Show) ద్వారా కమెడియన్ రియాజ్ (Comedian Riyaz) తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ షోలో తన కామెడీతో అందర్నీ అలరించాడు. ఇప్పుడు యూట్యూబ్ (Youtube) లో కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తూ.. నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పత్రాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. తాను ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ అని షోలో వేసే స్కిట్స్ ద్వారా చాలా సందర్భాల్లో తెలిపాడు. చాలా మంది సెలబ్రిటీలు, ఆర్టిస్టులు జనసేన (Janasena)కు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు.. ఎవరూ నేరుగా జనసేనలో చేరట్లేదు. అలా చేరిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. కానీ రియాజ్ మాత్రం తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. అంతేకాదు త్వరలో తాను జనసేన తరుపున బరిలో దిగుతున్నానని.. ఎక్కడ నుంచి పోటీ చేసేది అన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చాడు కమెడియన్ రియాజ్..
నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ ఎలక్షన్స్ లో జనసేన కూడా పోటీ చేయబోతుంది. దీంతో ఈ సారి నెల్లూరు కార్పొరేషన్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో నెల్లూరు 30వ డివిజన్ నుంచి రియాజ్ పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రియాజ్ ని చూసే జనసేనకు సపోర్ట్ చేసే సెలబ్రిటీలు జనసేనలో జాయిన్ అవుతారో లేదో చూడాలి.
ఇదీ చదవండి: నెల్లూరు.. తిరుమలలో కుండపోత.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు
ఇప్పటికే ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: ఏపీలో మళ్లీ ఎన్నికల హీట్.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. వివరాలివే
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న కౌంటింగ్ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Muncipal elections 2021, Telugu comedian