హోమ్ /వార్తలు /national /

రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలి: హైకోర్టు

రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలి: హైకోర్టు

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని...సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టుస్పష్టం చేసింది.

రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్ర కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని...సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టుస్పష్టం చేసింది. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... మరోసారి హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశారు.

తనకు భద్రత కల్పించాలంటూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయలేదంటూ రేవంత్ రెడ్డి డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై కేంద్రంను కూడా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

First published:

Tags: Congress, High Court, Revanth reddy, Telangana, Telangana Election 2018

ఉత్తమ కథలు