హోమ్ /వార్తలు /national /

అవసరమైతే తెలంగాణ బంద్... ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం

అవసరమైతే తెలంగాణ బంద్... ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)

నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.

  తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై ఇవాళ అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతల్ని ఆహ్వానించారు.ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదన్నారు. ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమన్నారు.సీఎం కేసీఆర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని విమర్శించారు.

  ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, కార్మికులు దాచుకున్న ఫీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీపై డిజిల్ భారం ఎక్కువైందని, డీజిల్ పై 27శాతం పన్ను వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని, వారంతా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఫ్రజలు కూడా తమ సమస్యల్ని అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యమం తమ కడుపు నింపుకోవడానికి కాదన్నారు. ఆర్టీసీ బతికితే ప్రతి గ్రామంలో ప్రజలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు.

  ఇవికూడా చూడండి:

  ఓ ఆర్టీసీ కండక్టర్ తల్లి ఆవేదన

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: CM KCR, Rtc, Telangana, Telangana Politics, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు