హోమ్ /వార్తలు /national /

Nizamabad: ఇద్దరు కొడుకులు.. రెండు పార్టీలు.. ఎంపీ డి.శ్రీనివాస్ రియాక్షన్ ఇదే..

Nizamabad: ఇద్దరు కొడుకులు.. రెండు పార్టీలు.. ఎంపీ డి.శ్రీనివాస్ రియాక్షన్ ఇదే..

డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

Nizamabad News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా చక్రం తిప్పానని డి.శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన మాజీమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఇంతకాలం టీఆర్ఎస్‌లో ఉండగా..ఆయన రెండో కుమారుడు అరవింద్ బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పెద్ద కొడుకు సంజయ్ టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబంలో ముగ్గురు నాయకులు మూడు పార్టీల్లో ఉన్నట్టయ్యింది. తన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంపై డి.శ్రీనివాస్ స్పందించారు.

  ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ చాలా మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది ఎంపీల ఇళ్లల్లో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని అన్నారు. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకులు ఇతర పార్టీలో ఉండడం కొత్త విషయం కాదని కొట్టిపారేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు. తనకు జీబులు ఎక్కి, కార్లలో తిరిగి ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు మాజీ మేయర్ సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్‌లు రెండు కళ్ళ లాంటి వారని అన్నారు.


  తన కొడుకులిద్దరు ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇద్దరు పిల్లలు స్వతంత్రంగా సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఎదిగారని పేర్కొన్నారు. తనకు సంబంధం లేని పార్టీలో అరవింద్ చేరినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అతడు కష్టపడి ఎంపీగా గెలిచాడని అన్నారు. నిజామాబాద్ మేయర్‌గా సంజయ్ ఐదు సంవత్సరాలు రిమార్క్ లేకుండా పని చేశాడని డీఎస్ అన్నారు. ఇక తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది లేనిది కేసీఆరే చెప్పాలని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నది తనకే తెలియదని వ్యాఖ్యానించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: D Srinivas, Telangana

  ఉత్తమ కథలు