హోమ్ /వార్తలు /national /

ఇంటికో ఉద్యోగం ఎవరూ ఇవ్వరు.. ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్

ఇంటికో ఉద్యోగం ఎవరూ ఇవ్వరు.. ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం నిలబడినా, తామే గెలుస్తామన్నోళ్ల పరిస్థితి ఏంటని.. పరోక్షంగా బీజేపీపై సెటేర్లు వేశారు.

తెలంగాణలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం, అధికారిక టీఆర్ఎస్ జోరు తగ్గడంతో.. ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం నిలబడినా, తామే గెలుస్తామన్నోళ్ల పరిస్థితి ఏంటని.. పరోక్షంగా బీజేపీపై సెటేర్లు వేశారు. నీటి బుడగలా ఎగిరెగిరి పడినోళ్లంతా ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఈ సందర్భంగా ఉద్యోగాలపైనా ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వం అయినా ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అది అసాధ్యమని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలవగానే ఉద్యోగాలు గుర్తుకు వచ్చాయా? అని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నపుడు ఆయన ఏం చేశారని.. నిరుద్యోగుల గురించి అప్పుడెందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

కాగా, తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌తో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల సిబ్బంది మూడు రోజులుగా ఓట్లు లెక్కిస్తున్నారు. రెండు చోట్లా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయింది. ఎవరికీ 50శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. నల్గొండ సెగ్మెంట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్‌లో సురభి వాణిదేవి లీడింగ్‌లో ఉన్నారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యంలో ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐతే శనివారం రాత్రి నాటికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

First published:

Tags: Hyderabad, Talasani Srinivas Yadav, Telangana, Telangana mlc election

ఉత్తమ కథలు