తెలంగాణలో వెకిలి మాటాలు మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఏప్రిల్ 27కి తమ పార్టీకి 20 ఏళ్లు నిండాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం చాలా కష్టమని.. అలాంటి కష్టమైన అంశం కేసీఆర్ వల్లే సాధ్యమైందని కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ (Telangana) ఉద్యమానికి గులాబీ జెండా మోసినప్పుడు అప్పటి ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరించిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ (CM KCR) సాఫ్ట్ అయ్యారని కొందరు భావిస్తున్నారని.. కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో ఎవరూ ఊహించని విధంగా కామారెడ్డి జిల్లాని అభివృద్ది చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు.
కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయం చేసిన మాజీమంత్రి షబ్బీర్ అలీకి సిగ్గు, ఎగ్గూ ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఉన్నాడని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదు, సాగు, త్రాగు నీరు లేదని అన్నారు. 200 రూపాయల పెన్షన్‌కి కాంగ్రెస్ వాళ్లు డబ్బాలు కొట్టుకున్నారని ఆరోపించారు.
త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం
టీఆర్ఎస్కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?
42 లక్షల మందికి రూ.10వేల కోట్లను నెలకి పెన్షన్ల రూపంలో ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో మొదటిసారి ఒంటరి మహిళకు పెన్షన్ ఇస్తోంది కేసీఆర్ అని.. ప్రైవేట్ ఆస్పత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారని గుర్తుచేశారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. ప్రతి పేదవాడి మొహంలో సంతోషం చూడాడనికి సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణలో నడుస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయండని అడుగుతున్నారని గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.