హోమ్ /వార్తలు /national /

Dubbaka Bypolls 2020: సోషల్ మీడియాకు ఎక్కువ.. పనికి తక్కువ.. బీజేపీపై హరీశ్ రావు ఫైర్

Dubbaka Bypolls 2020: సోషల్ మీడియాకు ఎక్కువ.. పనికి తక్కువ.. బీజేపీపై హరీశ్ రావు ఫైర్

హరీశ్ రావు (File)

హరీశ్ రావు (File)

ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక లో రాజకీయ నాయకులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ, కాంగ్రెస్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • News18
 • Last Updated :

  దుబ్బాక ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ సోషల్ మీడియాకు ఎక్కువ.. పనికి తక్కువ అని ఎద్దేవా చేశారు. రామక్కపేటలో జరిగిన ప్రచార ర్యాలీలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆనాడు పదేండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల మోటార్లు కాలిపోవడం నిత్య కృత్యమయ్యేదని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధలు తప్పాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దొంగ చాటుగా కరెంటు ఇస్తే రామక్కపేట లో బోర్లు కాలాయని, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పరిస్థితి లేదని అన్నారు. కాళేశ్వరం నీటిని తోగుట దాకా తీసుకొచ్చామని చెప్పారు. తమ పాలనలోనే ఈ నియోజకవర్గానికి తాగునీళ్లు ఇచ్చామని.. అతి కొన్ని రోజుల్లో ప్రతి ఎకరానికి సాగునీరిస్తామని అన్నారు.


  డెబ్బై ఏండ్లలో యాబై ఏండ్లు కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నదనీ.. కానీ సాగు, తాగు నీరిచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో దుబ్బాక నియోజకవర్గంలో త్వరలోనే చెరువులన్నీ నింపుతామని అన్నారు. బీడీలు చేసే మహిళల గురించి కాంగ్రెస్, బీజేపీల నాయకులు బాగా మాట్లాడుతున్నారనీ, కానీ వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లలో ఎక్కడైనా బీడీ కార్మికులకు ఒక్కపైసా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. కానీ తాము మాత్రం బీడీ కార్మికులకు నెల నెల రూ. 2 వేలు అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల వారికి రూ. 2016 పింఛన్ ఇస్తున్నామని, కానీ బీజేపీ ఎక్కడైనా ఇస్తుందా అని నిలదీశారు.

  పింఛన్లలో 98 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే.. బీజేపీ ఇచ్చేది 2 శాతం కూడా ఉండదని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణ లో ఉన్నది ఒక్కడే ఎమ్మెల్యే నని.. అయినా వాళ్లు చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎక్కువ.. పనికి తక్కువ అని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా.. జనాలకు వచ్చే పింఛన్ గానీ, ఇతర సంక్షేమ పథకాలు ఆపలేదని తెలిపారు. ప్రతి పేదింటి ఆడ పిల్లలకు కళ్యాణ లక్ష్మీ కింద రామక్కపేటలో పలువురికి ఆర్థిక సాయం అందజేశామని వివరించారు.

  తాను దుబ్బాక నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతానని హరీశ్ రావు అన్నారు. ఈ నియోజకవర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గం మాదిరే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రామక్కపేటలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను ఎన్నికలు పూర్తయ్యాక దశల వారీగా వాటిని కూడా పూర్తి చేస్తామని హరీశ్ రావు తెలిపారు. దుబ్బాక లో కాంగ్రెస్, బీజేపీలకు క్యాడర్ లేక హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి అరువు తెచ్చుకుంటున్నారనీ, కానీ టీఆర్ఎస్ కు ఆ అవసరం లేదని అన్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bjp, Congress, Dubbaka By Elections 2020, Harish Rao, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు