హోమ్ /వార్తలు /national /

సీఎం కేసీఆర్ కీలక సమావేశం... మంత్రి ఈటల దూరం

సీఎం కేసీఆర్ కీలక సమావేశం... మంత్రి ఈటల దూరం

సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వెళ్లలేదు.

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వెళ్లలేదు. రాజేంద్రనగర్‌లో పంచాయతీరాజ్ శాఖ భవనంలో జరిగిన సమావేశానికి ఆ శాఖ అధికారులు, తలసాని, ఈటల మినహా తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. మంత్రి తలసాని తిరుపతి వెళ్లడంతో ఈ సమావేశానికి రాలేకపోయారు. అయితే నగరంలోనే ఉన్న మంత్రి ఈటల రాజేందర్ మాత్రం తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి రాలేదని తెలుస్తోంది.

  కొద్దిరోజుల క్రితం తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాము గులాబీ జెండా ఓనర్లమని... తనకు మంత్రి పదవి బిక్ష కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. దీనిపై వెంటనే ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన సీఎం కేసీఆర్‌ను కలవలేదని తెలుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ రాకపోవడంతో... ఆయనకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం అందిందా లేదా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Etela rajender, Telangana, Trs

  ఉత్తమ కథలు