Home /News /national /

POLITICS TELANGANA MINISTER ETELA RAJENDAR INTERESTING COMMENTS IN KARIMNAGAR AK

వాళ్లు బాగుపడరు... తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కొట్లాడటం తెలుసు కానీ... దొంగ దెబ్బతీయడం తెలియదని అన్నారు. తాను కోట్లు ఖర్చు చేసినా... కానీ ఎవరి దగ్గర చేయి చాచలేదని వ్యాఖ్యానించారు. నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుందని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ధర్మం తప్పరని... అలా తప్పి ఉంటే తాను గెలిచేవాడిని కాదని అన్నారు. నమ్మక ద్రోహం చేసేవారు బాగుపడరని మంత్రి ఈటల రాజేందర్ కామెంట్ చేశారు. కొద్ది నెలల క్రితం కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసి టీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈటల... మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    కొన్ని నెలల క్రితం తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తననపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు.15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఈటల అన్నారు. మంత్రి పదవి బిక్ష కాదని... తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని... ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని,.బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Karimnagar, Trs

    తదుపరి వార్తలు