హోమ్ /వార్తలు /national /

Telangana Lok Sabha Election Result 2019: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌ మొదలు...

Telangana Lok Sabha Election Result 2019: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌ మొదలు...

రజత్ కుమార్(ఫైల్ ఫోటో)

రజత్ కుమార్(ఫైల్ ఫోటో)

Telangana Lok Sabha Election 2019 | తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది.

  Telangana Lok Sabha Election 2019 | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ  ప్రారంభమైంది. మొదటి దశలో ఏప్రిల్ 11న తెలంగాణలోని   17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు నిర్వహించారు. 43 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఇవాళ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గం.లకు ముందుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించబోతున్నారు. తెలంగాణలోని మొత్తం 35 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా... కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


  రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 35 చోట్ల ఏర్పాటు చేసిన 126 హాళ్ళలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది .హైదరాబాద్ లోక్‌సభకు సంబంధించిన ఓట్లను ఏడు ప్రాంతాల్లో...సికింద్రాబాద్‌కు సంబంధించి ఆరు ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక హాల్‌కు 14 టేబుళ్ళ చొప్పున, మల్కాజ్‌గిరిలోని మేడ్చల్, ఎల్.బి.నగర్ సెగ్మంట్లకు 28 టేబుళ్ళ చొప్పున ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మంట్లలో ప్రతి సెగ్మంట్‌కు రెండు హాల్స్ లో హాల్‌కు18 చొప్పున 36 టేబుళ్ళు ఏర్పాటుచేశారు. ఉదయం 8గంటలకు మొదట పోస్టల్ ఓట్లను, ఇటిపిబిఎస్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8.20 గంటలకు ఈవిఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవిఎంల రౌండ్లన్నీ పూర్తయిన తరువాత ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసిన వివిప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తారు. తేడా వచ్చిన చోట వివిపాట్ల స్లిప్పుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారు.


  పోటీలో ఉన్న అభ్యర్థులు కానీ, వారి ఏజంట్లు కానీ రీకౌంటింగ్ కోరితే .. వారి విన్నపాలను మన్నించే, తిరస్కరించే అధికారం కేవలం రిటర్నింగ్ అధికారులకే ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోలేదు. ఒకవేళ ఆ విజ్ఞప్తులను సదరు అధికారి తిరస్కరించే పక్షంలో ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్ కుమార్ స్పష్టం చేశారు.


  రాష్ట్ర, కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, అలాగే అన్ని కేంద్రాల్లో మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వార్తలు సేకరించే విలేకరులను బృందాలుగా ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాలలోకి విడతలవారీగా పంపుతామని రజత్ కుమార్ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లను లోనికి అనుమతించరని స్పష్టంచేశారు.

  First published:

  Tags: Lok Sabha Election 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs