హోమ్ /వార్తలు /national /

టీజేఎస్ మేనిఫెస్టో: 'తెలంగాణ మ్యూజియంగా ప్రగతి భవన్'

టీజేఎస్ మేనిఫెస్టో: 'తెలంగాణ మ్యూజియంగా ప్రగతి భవన్'

కోదండరామ్ (ఫైల్ ఫొటో)

కోదండరామ్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సోమవారం పార్టీ మేనిఫెస్టో, గుర్తులను ప్రకటించారు.

  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సోమవారం పార్టీ మేనిఫెస్టో, గుర్తులను ప్రకటించారు. 'అగ్గిపెట్టె' గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అగ్గిపెట్టె గుర్తుతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను పార్టీ ముఖ్య నేత ఒకరు చదివి వినిపించారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు వెల్లడించారు.

  టీజేఎస్ మేనిఫెస్టో..

  అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ

  అధికారంలోకి వచ్చిన ఏడాదే లక్ష ఉద్యోగాల ప్రకటన, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన

  నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ.3వేల భృతి

  అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసుల ఎత్తివేత

  అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు

  కౌలుదారులకు కూడా ప్రభుత్వ పథకాల వర్తింపు

  ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కటుంబాలకు పరిహారం

  ఇందిరాపార్క్ ధర్నా చౌక్ పునరుద్దరణ

  ప్రగతిభవన్‌ను తెలంగాణ మ్యూజియంగా ప్రకటన

  ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను రద్దు చేస్తాం

  సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ కాంట్రాక్టర్లకే అప్పగిస్తాం

  రైతు వ్యతిరేక 2016 భూసేకరణ చట్టం రద్దు చేస్తాం.. 2013 చట్టం తెస్తాం

  పరువు, కులం పేరుతో జరిగే హత్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు

  ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు రద్దు చేస్తాం

  విధానపరమైన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచేలాపారదర్శక ప్రజాస్వామిక పాలన

  ప్రజలందరికి ఉచిత విద్య, వైద్య సదుపాయం

  వ్యవసాయ నైపుణ్యా అభివృద్ది పెంచేలా చర్యలు

  రాష్ట్రంలో పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు