హోమ్ /వార్తలు /national /

ఆలస్యమైంది.. దసరాకే పొత్తులు కొలిక్కి రావాల్సింది: కోదండరాం

ఆలస్యమైంది.. దసరాకే పొత్తులు కొలిక్కి రావాల్సింది: కోదండరాం

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(File)

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(File)

ఈ ఎన్నికలు టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు, ప్రజాస్వామిక ఆకాంక్షలకు నడుమ జరుగుతున్న ఘర్షణ అని కోదండరాం అభివర్ణించారు. కూటమి ఏర్పాటు ఇప్పటికే ప్రజలకు ఓ భరోసా కల్పించిందని చెప్పారు.

  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సోమవారం పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలని అంశాలతో పాటు, కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీట్ల సర్దుబాటుపై ఆదివారం కాంగ్రెస్‌తో చర్చ జరగాల్సి ఉందని.. కానీ టీజేఎస్ వరంగల్‌ సమావేశంతో అది వాయిదాపడిందని చెప్పారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీతో భేటీ అవుతున్నామని.. నేటితో సీట్ల సర్దుబాటు తుదిరూపం తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

  రాబోయే ఎన్నికల్లో 10 స్థానాల్లో తాము పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. మరో మూడు, నాలుగు స్థానాల్లోనూ తమకు బలమైన అభ్యర్థులు ఉన్నందునా.. కాంగ్రెస్ దాన్ని పరిశీలించాలని కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే కొంతమేర ఏకాభిప్రాయం కుదిరిందని.. నేటి చర్చలతో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దసరా నాటికే ఇదంతా జరిగిపోయి ఉండాల్సిందని.. పొత్తులు ఆలస్యం కావడంతో ప్రజా సంఘాలు నిరుత్సాహపడ్డాయని అన్నారు. ఈ గందరగోళం నుంచి తొందరగా బయటపడి ఉంటే.. వారు కూడా తమతో కలిసి వచ్చేవారని చెప్పారు.

  ఏదేమైనా తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు, ప్రజాస్వామిక ఆకాంక్షలకు నడుమ జరుగుతున్న ఘర్షణ ఇది అని అభివర్ణించారు. కూటమి ఏర్పాటు ఇప్పటికే ప్రజలకు ఓ భరోసా కల్పించిందని చెప్పారు. టీఆర్ఎస్‌కు కూటమినే ప్రత్యామ్నాయం అని ప్రజలు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కూటమి ఏర్పాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఓ కార్యాచరణ కోసం ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామిక శక్తులు కూడా కూటమిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  ఇది కూడా చదవండి: 95 స్థానాల్లో పోటీ.. మొత్తం లిస్ట్ ఒకేసారి ప్రకటించనున్న కాంగ్రెస్!

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: CM KCR, Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana News

  ఉత్తమ కథలు