తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేడు తన నివాసంలో ఆవిష్కరించారు.గత ఏడాది బ్రిటన్లో ఏడు చోట్ల బతుకమ్మ నిర్వహించిన జాగృతి యూకే శాఖ ఈసారి యూకేలోని పది వేర్వేరు ప్రాంతాలలో బతుకమ్మను నిర్వహించబోతుంది.'పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ' అనే నినాదంతో ఈసారి యూకేలో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి తెలిపారు. చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బతుకమ్మతో వచ్చిన ఆడబిడ్డలకు నారాయణపేట చేనేత చీరలను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. నేడు జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, కోరబోయిన విజయ్, రోహిత్ రావు, ప్రశాంత్ పూసా, నితీష్ వాడ్రేవు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bathukamma, Kalvakuntla Kavitha, Telangana