హోమ్ /వార్తలు /national /

ఈటెలకు షాక్... సీఎం కేసీఆర్‌కు వైద్యఆరోగ్యశాఖ బదిలీ.. గవర్నర్ ఉత్తర్వులు

ఈటెలకు షాక్... సీఎం కేసీఆర్‌కు వైద్యఆరోగ్యశాఖ బదిలీ.. గవర్నర్ ఉత్తర్వులు

Eetala Rajender:  వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈటల వద్ద ఏశాఖ లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని తెలుస్తోంది.

Eetala Rajender: వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈటల వద్ద ఏశాఖ లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని తెలుస్తోంది.

Eetala Rajender: వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈటల వద్ద ఏశాఖ లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారని తెలుస్తోంది.

  తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్యఆరోగ్యశాఖ నుంచి ఈటలను తప్పించారు. ఆయన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం.. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆయన్ను వైద్యఆరోగ్యశాఖ నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు సిఫారసు చేశారు. అంతేకాదు ఆ శాఖను తనకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్రవేశారు. ప్రస్తుతం మంత్రి ఈటల వద్ద ఏశాఖ కూడా లేదు. త్వరలోనే మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్ చేస్తారని తెలుస్తోంది.


  ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను ఊపేస్తున్న విషయం తెలిసిందే. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈటల తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు. రిజిస్ట్రేష‌న్ కుద‌ర‌ద‌న్నా అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి భార్య జ‌మున‌, కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నట్లు బాధిత రైతులు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఉంది. 130/5, 130/10, 64/6 స‌ర్వే నెంబ‌ర్ల‌లో గ‌ల భూమిని మంత్రి క‌బ్జా చేసినట్లు ఆ ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారు. ఈటలకు చెందిన జమున హ్యాచరీస్ కంపెనీ కోసమే ఈ భూములను కబ్జా చేశారని.. తమకు న్యాయంచేయాలని కోరారు.

  రైతుల విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని భూముల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరీష్ భూ రికార్డులను పరిశీలించారు. మంత్రి ఈటలకు చెందిన హ్యాచరీస్‌లో అసైన్డ్ భూమి ఉందని..క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాత సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

  ఈ వ్యవహారంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో త్వరలోనే అన్ని వివరాలు చెబుతానని అన్నారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని, ఆ భూములన్నీ ఇప్పటికీ వాళ్ల దగ్గరే ఉన్నాయని ఈటల చెప్పారు. ముందస్తు ప్రణాళికతో, కట్టు కథతో తన క్యారెక్టర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఈటల సవాల్ విసిరారు.

  First published:

  Tags: CM KCR, Eetala rajender, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు