హోమ్ /వార్తలు /national /

15 సీట్లు కావాలి, సాగదీస్తే కష్టం: రాహుల్ గాంధీతో కోదండరాం

15 సీట్లు కావాలి, సాగదీస్తే కష్టం: రాహుల్ గాంధీతో కోదండరాం

 కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. టీడీపీకి 14 సీట్లు కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐ పంచుకోవాల్సి వస్తుంది.

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సమావేశం అయ్యారు. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు మీద చర్చించారు. సీట్ల పంపకాలు త్వరగా తేల్చాలని రాహుల్ గాంధీని కోరారు. సీట్ల పంపకాలు పూర్తయితేనే కూటమి పరిపూర్ణం అవుతుందని పరోక్షంగా హెచ్చరిక సంకేతాలు ఇచ్చారు. రాహుల్‌తో కోదండరాం సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అట్టడుగు వర్గాల వారి సమస్యలకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ క్రమంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తున్నట్టు చెప్పారు. తాము కూడా అదే ప్రయాణంలో ఉన్నామని కోదండరా వివరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్న కోదండరాం.. ప్రజాకూటమితో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అది వీలైనంత త్వరగా పూర్తికావాలన్నారు. కలలుగన్న తెలంగాణ కోసం కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.

  కూటమిని త్వరగా ఏర్పాటు చేయాలి. కాలయాపన చేస్తే నష్టం జరుగుతుంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి మిగిలిన పని ప్రారంభిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఉమ్మడి కార్యాచరణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కూటమిని త్వరగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. భాగస్వామ్య పక్షాలకు టికెట్ల పంపకాల మీద త్వరగా తేలుస్తామన్నారు. రేపు(శనివారం) హైదరాబాద్ ‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతాం. మాకు న్యాయసమ్మతమైన సీట్లు కావాలి.

  కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు

  కోదండరాం సారధ్యంలోని తెలంగాణ జనసమితి మొత్తం 17 సీట్లు అడుగుతోంది. కనీసం 15 సీట్లు కావాలని పట్టుబడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. టీడీపీకి 14 సీట్లు కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐ పంచుకోవాల్సి వస్తుంది. దీంతో టీజేఎస్‌లో నిరసన వ్యక్తం అవుతోంది. అయితే, పూర్తిస్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని కోదండరాం అన్నారు.

  ఇవి కూడా చదవండి

  First published:

  Tags: Kodandaram, Praja Kutami, Telangana Election 2018, Tpcc

  ఉత్తమ కథలు