హోమ్ /వార్తలు /national /

జనగామ నుంచి కోదండరామ్ పోటీకి లైన్ క్లియర్

జనగామ నుంచి కోదండరామ్ పోటీకి లైన్ క్లియర్

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైల్ ఫోటో(Image:Facebook)

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైల్ ఫోటో(Image:Facebook)

మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు 8 స్థానాలు కేటాయించగా, ఈ స్థానాలకు ఇవాళ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

  తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ జనగామ నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేయడం తెలిసిందే. ముందుగా కథనాలు వెలువడినట్లే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. జనగామ సీటును టీజేఎస్‌కు కేటాయించినందునే పొన్నాలకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో కోదండరాం జనగామ నుంచి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి‌తో కోదండరామ్ తలపడనున్నారు.

  మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు 8 స్థానాలు కేటాయించగా, ఈ స్థానాలకు ఇవాళ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఆ పార్టీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

  జనగామ టికెట్ తనకు కేటాయించకపోవడం పట్ల పొన్నాల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ టికెట్ తనకు కేటాయించకుంటే బీసీలకు అన్యాయం చేయడమేనని ఇది వరకే ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పొన్నాలకు లోక్‌సభ టికెట్ ఆఫర్ చేయడంతో ఆయన్ను శాంతింపజేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. లేని పక్షంలో తప్పనిసరిగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Kodandaram, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు