హోమ్ /వార్తలు /national /

టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం...ప్రజాకూటమి నేతల ఆరోపణ

టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం...ప్రజాకూటమి నేతల ఆరోపణ

ఎల్.రమణ(ఫైల్ ఫోటో)

ఎల్.రమణ(ఫైల్ ఫోటో)

Telangana Election 2018 | చివరకు 108, 104, మీడియా వాహనాల్లో కూడా టీఆర్ఎస్ నేతలు డబ్బు, మద్యం తరలిస్తున్నారని ప్రజాకూటమి నేతలు ఆరోపించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రజా కూటమి నేతలు ఆరోపించారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారని.. పక్షపాత వైఖరితో ప్రజాకూటమి నేతల ఇళ్ల మీద దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రజా కూటమి నేతలు ఎల్.రమణ, వీహెచ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సీఈఓ రజత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ, వీహెచ్...ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ నివాసముంటున్న ప్రగతి భవన్, ఫాం హౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగలరా? అని ప్రశ్నించారు.

పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న అధికారుల వివరాలను సీఈసీకి ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ, సొంత మీడియా వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారన్నారు. చివరకు 108, 104, మీడియా వాహనాల్లో కూడా డబ్బు, మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడుతుతూ ప్రత్యర్థులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు.

First published:

Tags: Mahakutami, Telangana Election 2018

ఉత్తమ కథలు