రేవంత్ రెడ్డిని విడుదల చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయనను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏ ఆధారాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీంతో రేవంత్‌ను వెంటనే విడుదల చేయాలంటూ డీజీపీని ఆదేశించారు సీఈఓ రజత్ కుమార్. భారీ భద్రత నడుమ రేవంత్‌ను కొడంగల్‌కు పోలీసులు తరలించారు.
అల్లర్లు జరగవచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆ నివేదిక కాపీని కోర్టుకు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించారు న్యాయమూర్తి. దీంతో రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డీజీపీకి ఆదేశించారు సీఈఓ రజత్ కుమార్.
కేసీఆర్ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని ఆయనను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. బంద్‌కు రేవంత్ పిలుపునిస్తే తప్పేంటని ప్రశ్నించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, High Court, Revanth Reddy, Telangana, Telangana Election 2018, Telangana News