Home /News /national /

POLITICS TELANGANA CM KCR REACTION ON TRS DEFEAT AND BJP VICTORY IN DUBBAKA BY ELECTIONS AK

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

దుబ్బాక ఫలితం చూసి పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని భావించిన టీఆర్ఎస్‌కు బీజేపీ ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నికల పోరులో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. దుబ్బాకలో బీజేపీ సాధించిన విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సానుభూతి కలిసొచ్చిందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

    దుబ్బాక ఫలితం చూసి పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేదని ఆయన నేతలకు చెప్పినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అబద్ధాలకు ప్రచారం చేస్తోందని.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలతో మేథోమథనం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    మరోవైపు రేపటి తెలంగాణ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై కూడా పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరపై రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న నిరసనల ఈ భేటీలో చర్చకు వచ్చిందని సమాచారం. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. సాధ్యమైనంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలను వెళ్లాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డిసెంబర్ మొదటి వారంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ పడక ముందు గ్రేటర్ ఎన్నికలు జరపాలని భావిస్తున్న టీఆర్ఎస్.. విపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకముందే గ్రేటర్‌ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Dubbaka By Elections 2020, Telangana, Trs

    తదుపరి వార్తలు