హోమ్ /వార్తలు /national /

CM KCR Dubbaka: దుబ్బాకలో గ్రౌండ్ క్లియర్‌గా ఉంది.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM KCR Dubbaka: దుబ్బాకలో గ్రౌండ్ క్లియర్‌గా ఉంది.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR Dubbaka: ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన సీఎం కేసీఆర్... దుబ్బాక ఉప ఎన్నికల అంశంపై స్పందించారు.

  దుబ్బాకలో టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన సీఎం కేసీఆర్... దుబ్బాక ఉప ఎన్నికల అంశంపై స్పందించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎఫ్పుడో డిసైడయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. చిల్లర తతంగాలు నడుస్తునే ఉంటాయి.. వాటిని పట్టించుకోమని స్పష్టం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉందని.. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని కేసీఆర్ తెలిపారు. దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్‌కు పెద్ద లెక్కే కాదన్నారు.

  మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు దూకుడు పెంచారు. రాష్ట్రంలో రైతుల‌కు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శించారు. గ‌తంలో ఓట్ల కోసం లీడ‌ర్లు గ్రామాల‌కు వ‌స్తే...మ‌హిళ‌లు ఖాళీ నీటి బిందెల‌తో నిర‌స‌న తెలిపి ప్రశ్నించేవారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ఆ ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదన్నారు. విదేశీ మ‌క్కలు తెచ్చి రైతుల నోట్లో మ‌ట్టి కొట్టాల‌ని బీజేపీ చూస్తోందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

  దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలం, మోతే గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్‌రావు ప్రచారం నిర్వహించారు. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీటర్లు పెట్టేది మోటార్లకు కాదని.. టీఆర్ఎస్‌కని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు. దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని రఘునందన్‌రావు విమర్శించారు. దుబ్బాక ఫలితాలు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆహాంకారానికి గుణపాఠంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు