హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న కేసీఆర్ సమావేశం..

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న కేసీఆర్ సమావేశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు కార్మికుల చొప్పున సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇందుకోసం వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించారు. ప్రతీ డిపో నుంచి వచ్చే ఐదుగురు కార్మికుల్లో కచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని, అన్ని వర్గాల కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.

డిసెంబర్ 1న మధ్యాహ్నం కార్మికులతో సమావేశమై ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తామని సీఎం తెలిపారు. ప్రగతి భవన్‌లోనే కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి.. భోజనం అనంతరం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ,ఈడీలు,ఆర్ఎంలు,డీవిఎంలను ఆహ్వానించనున్నారు.

First published:

Tags: CM KCR, Telangana, Telangana RTC strike, TSRTC Strike

ఉత్తమ కథలు