హోమ్ /వార్తలు /national /

Telangana: మేం తలుచుకుంటే.. బీజేపీకి సీఎం కేసీఆర్ వార్నింగ్

Telangana: మేం తలుచుకుంటే.. బీజేపీకి సీఎం కేసీఆర్ వార్నింగ్

ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది మంది భాగస్వాములౌతారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారన్న కేసీఆర్.. లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది ఎక్కడపోతారని అన్నారు. కార్మికులు చల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం కష్టమని.. కోనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడని అన్నారు. మొత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నదని.. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా వుండే ప్రమాదం వుందని అభిప్రాయపడ్డారు.

Telangana: బీజేపీ వాల్లు కొత్త బిచ్చగాళ్లలా ప్రవర్తిస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారని వ్యాఖ్యానించారు.

  నల్లగొండ జిల్లా హాలియా సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సభలో ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో.. వారికి సభాముఖంగానే వార్నింగ్ ఇచ్చారు. వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ వాల్లు కొత్త బిచ్చగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కేసీఆర్ అన్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఒల్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.

  అయినా ఇలాంటి వాళ్లను తాము చాలామందిని చూశామని.. అనేక మందితో పోరాడామని కేసీఆర్ అన్నారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరని ప్రశ్నించారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌ నేతలు అని ఆరోపించారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నా.. కాంగ్రెస్ నేతలు నోరెత్తలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు.

  కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారని... మరి కాంగ్రెస్ నేతలు నాగార్జునసాగర్‌ కమీషన్ల కోసమే కట్టారా? అని ప్రశ్నించారు. నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య గురించి ఒక్కరైనా మాట్లాడారా? అని నిలదీశారు. రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందుకు పోరుబాట చేస్తారా? కాంగ్రెస్‌ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదని అన్నారు. మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తెలిపారు. తాను మాట్లాడిన దాంట్లో ఒక్క విషయం అబద్ధముున్నా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించాలని.. లేకపోతే ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Telangana

  ఉత్తమ కథలు